‘అల.. వైకుంఠపురములో’ నుంచి మరొకటి.. | Allu Arjun Ala Vaikunthapurramloo Movie Poster Here | Sakshi
Sakshi News home page

‘అల.. వైకుంఠపురములో’ నుంచి మరొకటి..

Oct 7 2019 6:06 PM | Updated on Oct 7 2019 7:42 PM

Allu Arjun Ala Vaikunthapurramloo Movie Poster Here - Sakshi

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో’. అల్లు అరవింద్, యస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయిక. ఇప్పటికే చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, బన్నీ డైలాగ్‌, ‘సామజవరగమన’సాంగ్‌తో ఈ సినిమాపై హైప్‌ను క్రియేట్‌ చేశాయి. తాజాగా బన్నీ అభిమానులకు దసరా కానుకగా సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

రౌడీలను చితక్కొట్టి.. స్టైల్‌గా నిల్చొని ఉన్న బన్నీ లుక్‌ను చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం బన్నీ ఫోటో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ కంపోజ్‌ చేసిన ‘సామజవరగమన’పాట సంగీత ప్రియులను ఎంతగానో ఆక్టట్టుకుంటోంది. ఇక శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడదల కానుంది.  టబు, జయరామ్, సుశాంత్, నివేదా పేతురాజ్‌ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement