
'కాన్‌టా లగా' గర్ల్ షెఫాలీ జరీవాలా బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. హిందీ బిగ్‌బాస్ 13వ సీజన్‌లో నాల్గవ వైల్డ్‌కార్డు ఎంట్రీగా షెఫాలి రానున్నారు. ఆమె బిగ్‌బాస్ హౌజ్‌లోకి రానుందనే విషయాన్ని కలర్స్ ఛానెల్ ధృవీకరిస్తూ.. ఈ మేరకు ఒక ప్రోమో రిలీజ్ చేసింది. అందులో షెఫాలీ బిగ్‌బాస్ ఇంటి సభ్యులతో స్పీకర్‌లో మాట్లాడుతూ.. హౌజ్ రెండు గ్రూపులుగా విడిపోయిందని, అయితే ఈ వారం నుంచి హౌజ్‌లోని సమీకరణాలు మారతాయని ఆమె చెప్తారు.
Aa rahi hai @shefalijariwala banne iss tedhe ghar ka hissa!
— COLORS (@ColorsTV) October 30, 2019
Dekhiye unhe aaj raat 10:30 baje.
Anytime on @justvoot.@vivo_india @beingsalmankhan @bharatpeindia @AmlaDaburIndia #BiggBoss13 #BiggBoss #BB13 #SalmanKhan pic.twitter.com/Tj8vvvrIcY
షెఫాలీ బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంపై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. తన ఎంట్రీతో హౌజ్‌లోని పరిస్థితులు మారతాయని దీమా వ్యక్తం చేస్తున్న షెఫాలీ కాన్ఫిడెన్స్‌ను మెచ్చుకొంటుండగా.. మరికొందరు మాత్రం వైల్డ్‌కార్డ్ ఎంట్రీ వద్దు.. నెక్స్ట్ సీజన్‌కు కొత్త కంటెస్టంట్‌గా తీసుకుంటే బావుండేదని అంటున్నారు. షెఫాలీకి బిగ్‌బాస్ టైటిల్ గెలిచే సత్తా ఉందని అంటుండగా.. మరికొంతమంది ఆమె బిగ్‌బాస్ హౌజ్‌లో ఏ గ్రూపులో జాయిన్ అవుతుందోనని లెక్కలేసుకుంటున్నారు. హౌజ్‌లో తాజాగా ఆర్తీ సింగ్, రష్మీ దేశాయ్ మధ్య వివాదం రాజుకుని, ఇద్దరి మధ్య ఉన్న బలమైన స్నేహం చెరిగిపోనుందా? అనే మరో ప్రోమోను కలర్స్ ఛానెల్ రిలీజ్ చేసింది. కాగా బిగ్‌బాస్ హౌజ్‌లో సగం మంది పాత కంటెస్టంట్ల స్థానంలో కొత్తవారు వస్తారని సల్మాన్‌ఖాన్ ఇప్పటికే చెప్పాడు. దీంతో బిగ్‌బాస్ హౌజ్‌లో ఏమి జరగనుందనే దానిపై ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.