స్మోకింగ్ మానేశా : అఖిల్ అక్కినేని

మిస్టర్ మజ్ను సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్, సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. థియేటర్లకు వెళ్లి అభిమానులను స్వయంగా కలవటంతో పాటు ఛానల్‌లకు ఇంటర్య్వూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తనకు స్మోకింగ్ అలవాటు ఉండేదని ఇటీవల దాన్ని వదిలేసినట్టుగా చెప్పాడు అఖిల్. అంతేకాదు అందరూ స్మోకింగ్ మానేయాలని సూచించాడు.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ హీరోగా తెరకెక్కిన మిస్టర్ మజ్ను ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు డివైడ్ టాక్ రావటంతో అఖిల్ సినిమా ప్రమోషన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాడు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతమందించగా బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి