ఇద్దరమ్మాయిలతో...

Aditi Rao Hydari, Lavanya Tripathi to work with Varun Tej in a sci-fi film - Sakshi

అంతరిక్షంలో ఆకర్షణ చాలా తక్కువ ఉంటుంది. ఆస్ట్రోనాట్‌ల మీద అంతగా పని చేయదు.  కానీ, ఈ ఆస్ట్రోనాట్‌ మీద మాత్రం ఆకర్షణ బలంగా పని చేస్తోంది. అయితే.. అది అంతరిక్షంలో పవర్‌ కాదు.. అందమైన హీరోయిన్స్‌ పవర్‌. మరి ఈ ఆస్ట్రోనాట్‌ ఎవరి ఆకర్షణకు గురయ్యాడు? అన్న విషయం తెలియాలంటే సినిమా రిలీజ్‌ వరకూ ఆగాల్సిందే. ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి డైరెక్షన్‌లో వరుణ్‌ తేజ్‌ హీరోగా అంతరిక్షం నేపథ్యంలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

వరుణ్‌ ఆస్ట్రోనాట్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు.  ఆల్రెడీ ఒక హీరోయిన్‌గా అదితీరావ్‌ హైదరీని ఫిక్స్‌ చేశారు. ఇప్పుడు మరో హీరోయిన్‌గా లావణ్యా త్రిపాఠిని తీçసుకున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై బిబో శ్రీనివాస్‌ సమర్పణలో రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ఈ నెల చివరి వారం నుంచి రెగ్యులర్‌ షూట్‌ స్టార్ట్‌ కానుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top