ఆ వీడియో డిలీట్ చేయండి : నటి వార్నింగ్‌ | Actress Priyanka Fire On Youtube Channels Over Fake News | Sakshi
Sakshi News home page

అక్కాతమ్ముడికి కూడా లింకు పెడతారు : నటి

Jul 22 2018 3:49 PM | Updated on Aug 28 2018 4:32 PM

Actress Priyanka Fire On Youtube Channels Over Fake News - Sakshi

డబ్బుల కోసం, వ్యూస్‌ కోసం యూట్యూబ్‌ చానల్స్‌ ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాయంటూ నటి మండిపడ్డారు.

హైదరాబాద్‌ : తమ రేటింగ్స్‌ కోసం, వ్యూస్‌ కోసం యూట్యూబ్‌ చానల్స్‌ ఎన్ని అడ్డదారులైనా తొక్కుతాయంటూ నటి ప్రియాంక మండిపడ్డారు. డబ్బుల కోసం, వ్యూస్‌ కోసం అక్కాతమ్ముడికి కూడా లింకులు పెట్టేరకం మీరు అంటూ యూట్యూబ్‌ వీడియోలపై ఆమె స్పందించారు. నిజాయితీగా తమ పని చేసుకునే వారిని డిస్టర్బ్‌ చేయొద్దని సూచించారు. తనపై ఇటీవల వచ్చిన వదంతులకు ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి ప్రియాంక ఓ వీడియో పోస్ట్‌ చేయగా ఆ వీడియో వైరల్‌గా మారింది. ‘చాలా కోపంగా, ఇర్రిటేటెడ్‌గా ఉన్నా. యూట్యూబ్‌ చానల్స్‌కు ఏం పని పాటాలేదా. ఇప్పుడు చెప్పండి. మీకు నేను కనిపిస్తున్నానా. లేకపోతే దెయ్యంలా ఉన్నానా. మీ వ్యూస్‌, డబ్బు కోసం జనాల్ని చంపేస్తారా.

మీరు నా గురించి పెట్టిన వీడియో డిలీట్‌ చేయండి. లేకపోతే ఆ వీడియో ఎవరు పెట్టారో తెలుసుకుని వేరే విధంగా చేయాల్సి ఉంటుంది. రేటింగ్స్‌ కోసం మీరు నేను చనిపోయానని పోస్ట్‌ చేసిన వీడియో మా కుటుంబసభ్యులు చూస్తే.. వారికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఏదైనా చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయండి. ఇలాంటి వీడియోలు పెడితే మీకు భారీగా వ్యూస్‌ వస్తాయేమో గానీ, మా ఇళ్లల్లో పరిస్థితి అలా ఉండదని, అది ఫేక్‌ న్యూస్‌ అని అందరికీ చెప్పేసరికి తల ప్రాణం తోకకొస్తుందంటూ’ నటి ప్రియాంక ఆ వీడియోలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కాగా, తమిళ బుల్లితెర నటి ప్రియాంక బుధవారం ఆత్మహత్య చేసుకోగా.. కొన్ని యూట్యూమ్‌ చానల్స్ తెలుగు నటి ప్రియాంక సూసైడ్‌ చేసుకున్నారంటూ ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement