ఒక్కరోజు 9 కోట్ల ఆఫర్.. నో చెప్పిన హీరో | actor Ranbir Kapoor say no to fairness cream add offer | Sakshi
Sakshi News home page

ఒక్కరోజు 9 కోట్ల ఆఫర్.. నో చెప్పిన హీరో

Apr 26 2017 5:14 PM | Updated on Sep 5 2017 9:46 AM

ఒక్కరోజు 9 కోట్ల ఆఫర్.. నో చెప్పిన హీరో

ఒక్కరోజు 9 కోట్ల ఆఫర్.. నో చెప్పిన హీరో

బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన అభయ్ డియోల్ ఫెయిర్ నెస్ క్రీమ్స్ ప్రకటనలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో స్టార్ హీరోలు, హీరోయిన్లు కాస్త వెనుకంజ వేస్తున్నారు.

ముంబై: బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన అభయ్ డియోల్ ఫెయిర్ నెస్ క్రీమ్స్ ప్రకటనలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో స్టార్ హీరోలు, హీరోయిన్లు కాస్త వెనుకంజ వేస్తున్నారు. దీంతో ఓ అగ్రనటుడు కొన్ని గంటలకుగానూ రూ.9 కోట్లు అందుకునే భారీ ఆఫర్‌ను చేజార్చుకున్నాడని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నుంచి నటి సోనమ్ కపూర్ వరకూ ఇలా సౌందర్య సంబంధ ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించే యాడ్స్‌లో నటించిన అందరిని అభయ్ బహిరంగంగానే విమర్శించాడు. మరోవైపు జాతివివక్షతో కూడిన వ్యాఖ్యలపై యాడ్ చేసినందుకు నేవియా క్షమాపణ కోరినట్లు అభయ్ డియోల్ తన ఫేస్‌బుక్‌ లో పోస్ట్ చేశాడు.

బాలీవుడ్‌లో ఫెయిర్ సెన్ క్రీమ్స్ వివాదం నెలకొన్న నేపథ్యంలో స్టార్ హీరో రణబీర్‌కపూర్‌కు ఓ ఫెయిర్ నెస్ క్రీమ్‌కు బ్రాండింగ్ చేసే చాన్స్ వచ్చింది. కేవలం ఒక్క రోజులోనే కొన్ని గంటలు యాడ్ చేస్తే రూ.9 కోట్లకు పైగా ఇస్తామని సంస్థ ఆఫర్ చేసినా.. రణబీర్ మాత్రం నో చెప్పాడట. 'తెల్లగా ఉంటే పరిపూర్ణత లభిస్తుంది. ఆత్మ విశ్వాసం పెంపొందుతుందంటూ' ప్రకటనలు చేసి జాత్యహంకారాన్ని కంపెనీలు ప్రోత్సహిస్తున్నాయని అభయ్ డియోల్ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. లేని తలనొప్పి ఎందుకు కొని తెచ్చుకోవడం అనుకున్నాడేమోగానీ.. రణబీర్ కపూర్ మాత్రం ఫెయిర్ నెస్ క్రీమ్ యాడ్‌లో నటించవద్దని డిసైడయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement