కొత్త సినిమా షూటింగ్‌లో ప్రమాదం | Accident in Aishwarya Rai New Movie sets | Sakshi
Sakshi News home page

ఐష్‌ కొత్త సినిమా షూటింగ్‌లో ప్రమాదం

Nov 6 2017 2:38 PM | Updated on Apr 3 2019 7:53 PM

Accident in Aishwarya Rai New Movie sets - Sakshi

ముంబై : బాలీవుడ్‌ నటి ఐశ్వర్య రాయ్‌ కొత్త చిత్రం ఫన్నె ఖాన్‌ సెట్స్‌లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ లేడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గాయపడినట్లు సమాచారం. ఈ మేరకు చిత్ర మేకర్లు ఓ ప్రటన విడుదల చేశారు.

‘‘ఓ మోటర్‌ సైకిల్‌ బలంగా ఢీ కొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన  వెంటనే ఆమెకు ప్రథమ చికిత్స అందించి ఆస్పత్రికి తరలించాం. ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారు. నిర్ల​క్ష్యంగా బైక్‌ నడిపి ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై కేసు నమోదు చేశాం’’ అని ప్రకటనలో ఉంది.

కాగా, ఐష్‌ పై ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. ఆమె(అసిస్టెంట్‌ డైరెక్టర్‌) చెవిలో వాకీ టాకీ ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకుని రోడ్డు దాటుతున్న క్రమంలో బైక్‌ వచ్చిన విషయాన్ని గుర్తించలేకపోయారని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. అయితే త్వరలోనే ఆమె తిరిగి షూటింగ్‌లో పాల్గొంటుందని మేకర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, అనిల్‌ కపూర్‌, ఐశ్వర్య రాయ్‌, రాజ్‌కుమార్‌ రావ్‌ ప్రధాన పాత్రలో ఫన్నె ఖాన్‌ రూపుదిద్దుకుంటోంది. ఐష్‌ రాజ్‌కుమార్‌ ప్రేమికులుగా కనిపించనున్నారు. ఎవ్రిబడీస్‌ ఫేమస్‌ అనే డచ్‌ చిత్రాకి ఇది రీమేక్‌. అతుల్‌ మంజ్రేకర్‌ డెబ్యూ డైరెక్షన్‌లో ఇది తెరకెక్కుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement