ఇంకేం ఇంకేం కావాలే...

80's stars get-together for their 9th reunion in Chennai - Sakshi

క్లాప్‌బోర్డులు, ఆర్క్‌ లైట్లు, స్టార్ట్‌ కెమెరా, షాట్‌ ఓకే... వీటితో బిజీగా ఉండే స్టార్స్‌ ఫర్‌ ఎ చేంజ్‌ అప్పుడప్పుడూ వీటికి దూరంగా ఉండాలని అనుకుంటారు. 1980లలో వెండితెరను ఏలిన స్టార్స్‌లో కొందరు ఇలానే అనుకుని, ప్రతి ఏడాదీ కలుస్తున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో చోట. కొన్నిసార్లు ప్రైవేట్‌ ప్లేసెస్‌ ఇందుకు వేదిక అయితే కొన్నిసార్లు ఒక్కో సెలబ్రిటీ మిగతా అందరికోసం తమ ఇంట్లో ఆతిథ్యం ఏర్పాటు చేస్తుంటారు. ప్రతి ఏడాదిలానే ఈసారి ‘1980స్‌ రీ–యూనియన్‌’ జరిగింది. ఇప్పుడు చెన్నైలో కలుసుకున్నారు. జనరల్‌గా రజనీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌ వంటి స్టార్స్‌ కూడా కనిపిస్తుంటారు.

ఈసారి వీళ్లు మిస్సింగ్‌. వైట్‌ అండ్‌ బ్లూ కలర్‌ని డ్రెస్‌కోడ్‌గా ఫిక్స్‌ చేసుకున్నట్లున్నారు. అందరూ తెలుపు, నీలం రంగు దుస్తుల్లో దర్శనమిచ్చారు. మోహన్‌లాల్, సీనియర్‌ నరేశ్, జాకీ ష్రాఫ్, అర్జున్, సుమన్,  శరత్‌కుమార్, భాగ్యరాజ్, సత్యరాజ్, సుహాసిని, ఖుష్బూ, శోభన, నదియా, రాధ తదితరులు పాల్గొన్నారు. లేడీ యాక్టర్స్‌ అందరూ ‘గీత గోవిందం’లోని ‘ఇంకేం ఇంకేం కావాలే..’ పాటకు డ్యాన్స్‌ చేశారట. మోహన్‌లాల్‌ కేరళలోని సంప్రదాయపు బోట్‌ నడుపుతున్నట్టు యాక్ట్‌ చేశారట. ఇలాంటి సరదా ఆటలతో సందడి చేశారని సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top