ఇంట్రడక్షన్‌ సీన్స్‌కే 60 కోట్లా? | 60 Crores Budjet for Jr Ntr Ramcharan Introdution Scene In RRR | Sakshi
Sakshi News home page

ఇంట్రడక్షన్‌ సీన్స్‌కే 60 కోట్లా?

Jul 11 2019 12:05 PM | Updated on Jul 14 2019 4:05 PM

60 Crores Budjet for Jr Ntr Ramcharan Introdution Scene In RRR - Sakshi

బాహుబలి తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో విజువల్‌ వండర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుsతునన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతోంది. బాహుబలిలా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో 2020లో సినిమాను రిలీజ్ చేయాలని నిశ్చయించుకున్నారు రాజమౌళి.

అయితే షూటింగ్ విషయంలో మాత్రం కాంప్రమైజ్‌ కావటం లేదట. కేవలం ఇద్దరు హీరోల పరిచయం సన్నివేశాల కోసం దాదాపు 60 కోట్లు ఖర్చు పెడుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఓ హైబడ్జెట్ సినిమా తెరకెక్కించేంత మొత్తాన్ని ఇంట్రడక్షన్‌ సీన్స్‌కే  పెడితే ఇక క్లైమాక్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో అంటున్నారు ఫ్యాన్స్‌.

డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతమదింస్తున్నారు. రామ్‌ చరణ్‌ సరసన బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా ఎన్టీఆర్‌కు జోడిగా నటించే విదేశీ భామ కోసం వెతుకుతున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగన్‌ అతిథి పాత్రలో అలరించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement