సింధు బయోపిక్‌.. 24 స్క్రిప్ట్స్‌ | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 2 2018 4:07 PM

24 Scripts For PV Sindhu Biopic - Sakshi

సౌత్ నార్త్‌ అన్న తేడా లేకుండా ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల బయోపిక్స్‌ మంచి విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్‌లో కూడా క్రీడా నేపథ‍్యమున్న బయోపిక్స్‌ తెర మీదకు వస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాదీ బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ షూటింగ్ ప్రారంభం కాగా ఇప్పటికు మరో స్టార్‌ ప్లేయర్‌ పీవీ సింధు జీవిత కథ కూడా రెడీ అవుతోంది.

రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు బయోపిక్‌ను బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ నిర్మిస్తున్నారు. గత రెండేళ్లు ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. అయితే ఈ గ్యాప్‌ సింధు మరిన్ని విజయాలు సాధించటంతో ప్రతీ సారి స్క్రిప్ట్‌ను రీరైట్‌ చేస్తూ వస్తున్నారట.

దీంతో ఇప్పటికే 24 వర్షన్లు రాసినట్టుగా తెలుస్తోంది. అయితే వీటిలో సింధు ఏ వర్షన్‌కు ఓకే చెప్తే దాన్నే సినిమాగా రూపొందించే ఆలోచనలో ఉన్నాడు సోనూ. ఇంకా సింధు పాత్రలో కనిపించబోయే నటిని ఫైనల్‌ చేయకపోయినా ఈ సినిమాలో ఓ చిన్న అతిథి పాత్రలో సింధు కనిపిస్తుందని తెలిపాడు సోనూ సూద్‌.

Advertisement
Advertisement