బరిలోనే పోటీ.. బయట స్నేహమే | PV Sindhu React On Friendship With Saina Nehwal | Sakshi
Sakshi News home page

బరిలోనే పోటీ.. బయట స్నేహమే

Oct 8 2018 9:15 AM | Updated on Oct 8 2018 9:31 AM

PV Sindhu React On Friendship With Saina Nehwal - Sakshi

సైనాతో ఎప్పుడూ పోటీ పడను. మేమిద్దరం దేశం కోసం ఆడుతున్నప్పుడు పోటీ ఎందుకుండాలి?

న్యూఢిల్లీ: సైనా నెహ్వాల్‌కు తనకు మధ్య ఎదురెదురుగా బరిలోకి దిగినప్పుడు మాత్రమే పోటీ ఉంటుందని, బయట మాత్రం తాము మంచి స్నేహితులమంటోంది బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు. హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సదస్సులో పాల్గొన్న సింధు ఈ మేరకు మీడియాతో మాట్లాడింది. ‘నా తల్లిదండ్రులు క్రీడాకారులు కావడం నా అదృష్టం. నేను ఏ ఆట ఆడాలనుకుంటే ఆ వైపు నన్ను ప్రోత్సహించారు. ‘మీ తల్లిదండ్రులు వాలీబాల్‌ క్రీడాకారులైనా మిమ్మల్ని ఆ ఆట వైపు ఎందుకు పంపలేదు?’ అని ఇప్పటికి ఎంతో మంది నన్ను అడిగారు.

కానీ, నాకు బ్యాడ్మింటన్‌ అంటే ఆసక్తి. అందుకే నా తల్లిదండ్రులు అటు వైపు పంపారు. వారి త్యాగానికి, కష్టానికి నేను న్యాయం చేయాలి’ అని పేర్కొన్నారు. సైనాతో పోటీ గురించి మాట్లాడుతూ... ‘సైనాతో ఎప్పుడూ పోటీ పడను. మేమిద్దరం దేశం కోసం ఆడుతున్నప్పుడు పోటీ ఎందుకుండాలి? విదేశాల్లో ఆడుతున్నప్పుడు మన దేశ ప్రతిష్ఠను నిలపాల్సిన బాధ్యత మాపై ఉంది. అక్కడ నేను వేరు, తను వేరుగా ఉండకూడదు. కానీ, ఆటలో భాగంగా మా ఇద్దరి మధ్య మ్యాచ్‌ జరిగినప్పుడు మాత్రమే పోటీ ఉంటుంది. కోర్టు నుంచి బయటకి వచ్చాక మేం తిరిగి స్నేహితుల్లా మారిపోతాం’ అని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement