
బాలీవుడ్ దర్శక–నిర్మాత విక్రమాదిత్య మొత్వాని, నటి సన్నీ లియోన్ అంతర్జాతీయ స్థాయిలో ఓ బయోపిక్ చేయనున్నారు. వెబ్ సిరీస్‌గా రానున్న ఈ బయోపిక్ హక్కులు సన్నీ లియోన్‌కి చెందిన సన్‌సిటీ సంస్థ దక్కించుకుందట.
దీంతో విక్రమాదిత్య మొత్వానికి చెందిన ఆండొలన్ ఫిల్మ్స్, సన్నీ లియోన్ ‘సన్ సిటీ’ సంస్థలు ఈ అంతర్జాతీయ బయోపిక్‌ను రూ పొందించనున్నాయి. ‘‘ఈ ప్రాజెక్ట్ కోసం అసోసియేట్ అవుతున్నందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. ఈ బయోపిక్‌లోని స్టోరీ నన్ను ఇన్‌స్పైర్ చేసింది’’ అని సన్నీ లియోన్ పేర్కొన్నారు. ఇక... ఇది ఎవరి బయోపిక్? ఇందులో నటీనటులు ఎవరు? సన్నీ లియోన్ కూడా ఈ సిరీస్‌లో నటిస్తారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.