పోర్న్‌ ఎక్కువగా చూడటం వల్ల...

Reasons Behind Youth Getting Addicted to Watch Porn, in Telugu - Sakshi

యవ్వనంలోకి అడుగుపెట్టగానే హార్మోన్ల ప్రభావంతో శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ సమయంలో అంత వరకు లేని కొత్త ఉత్సాహం, కోర్కెలు చుట్టుముడతాయి. సెక్స్‌కు సంబంధించిన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రస్తుత భారతదేశ ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు కారణంగా ఇందుకు సంబంధించిన విషయాలను బాహాటంగా చర్చించుకునే అవకాశం లేదు. అందుకని నిన్న, మొన్నటి వరకు సెక్స్‌ ఎడ్యూకేషన్‌కు సంబంధించిన విషయాలను పుస్తకాలు, స్నేహితుల ద్వారా తెలుసుకోవటం జరిగేది. కానీ, మొబైల్‌ ఫోన్‌, ఇంటర్‌నెట్‌ పుణ్యమా అని నేడు పోర్న్‌కు సంబంధించిన కంటెంట్‌ విచ్చలవిడిగా లభిస్తోంది.

దీంతో సెక్స్‌ ఎడ్యూకేషన్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకోవటానికి నేటి యువత ప్రధానంగా పోర్న్‌ సైట్లను ఆశ్రయిస్తోంది. విచ్చలవిడితనంతో పోర్న్‌ వీడియోలకు బానిసవుతోంది. అదే వారిలో సెక్స్‌ సంబంధ వ్యాధులకు గురయ్యేలా చేస్తోంది. 12- 20 ఏళ్ల వయస్సులో మెదడు న్యూరోప్లాస్టిసిటీకి సంబంధించి గొప్పమార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల కారణంగా మెదడు ఏ చర్యకైనా వేగంగా స్పందిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో పోర్న్‌ ఎక్కువగా చూడటం వల్ల అందుకు సంబంధించిన విషయాలు మెదడులో ముద్రవేసుకుపోతాయి. నిజజీవితంలోనూ అలాంటి అనుభూతి కావాలని మనసు కోరుకుంటుంది. ఆడ,మగల మధ్య సంబంధం సెక్స్‌కు సంబంధించిందేనన్న భావన కలుగుతుంది.  ముఖ్యంగా పోర్న్‌ వీడియోలలో నటించే వారి ప్రైవేట్‌ భాగాలు యువత మనసులో ప్రత్యేకంగా ముద్రపడిపోతాయి.

తమకు కాబోయే భాగస్వామి ప్రైవేట్‌ భాగాలు కూడా అలానే ఉండాలని కోరుకుంటారు. పోర్న్‌ వీడియోలలో నటించే వారు అందుకోసమే ప్రత్యేకంగా తీర్చిదిద్దబడ్డారన్న విషయాన్ని గుర్తించరు. ఇదే ఆ తర్వాతి రోజుల్లో పోర్న్‌కు బానిసైన వారి శృంగార జీవితాన్ని నాశనం చేస్తుంది. నేటి యువతపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవటం, విచ్చలవిడిగా ఇంటర్‌నెట్‌ సదుపాయం లభించటం, మొబైల్‌ ఫోన్స్‌ వాడకం ఇవన్నీ వారిని చెడుదోవ పట్టిస్తున్నాయి. పూర్తిగా పోర్న్‌కు బానిసైన యువత దారుణాలకు ఒడిగడుతోంది. వయసుతో సంబంధం లేకుండా దాదాపు 80 శాతం మంది పోర్న్‌ను చూస్తున్నారని అంచనా. ఇందులో ఆడ,మగ అన్న తేడాలేదని గుర్తించాలి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top