అహం, అనుమానాలతో ప్రేమ నిలబడదు | Googly Love Movie Review | Sakshi
Sakshi News home page

అహం, అనుమానాలతో ప్రేమ నిలబడదు

Nov 10 2019 12:35 PM | Updated on Nov 10 2019 12:41 PM

Googly Love Movie Review - Sakshi

గూగ్లీ చిత్రంలోని ఓ దృశ్యం

ఆ సమయంలోనే అతడికి స్వాతిపై అనుమానం మొదలతుంది.  ఆ అనుమానమే.. 

సినిమా : గూగ్లీ 
తారగణం : యశ్‌, కృతి కర్బంద
డైరక్టర్‌ : పవన్‌ వడయార్‌ 
భాష : కన్నడ 

కథ : శరత్‌ (యశ్‌) తనకు నచ్చింది చేసుకుపోయే మనస్తత్వం గల వ్యక్తి. జీవితాన్ని ఎంజాయ్‌ చేయాలనేది అతడి పాలసీ. తన కాలేజ్‌లో జరిగిన గ్లోబల్‌ బిజినెస్‌ సెమినార్‌లో స్వాతి(కృతి కర్బంద)తో అతడికి పరిచయం ఏర్పడుతుంది. పరిచయం స్నేహంగా మారి ఒకరినొకరు ప్రేమించుకోవటం మొదలుపెడతారు. అయితే తమ ప్రేమ సంగతి ఒకరికొకరు చెప్పుకోరు. శరత్‌ తన ప్రేమ విషయం స్వాతికి చెప్పాలా వద్దా అన్న సంకోచంలో ఉంటాడు. ఆ సమయంలోనే అతడికి స్వాతిపై అనుమానం మొదలతుంది.  ఆ అనుమానమే తర్వాత వారిద్దరి మధ్యా గొడవకు దారితీస్తుంది. స్వాతి, శరత్‌ ఒకరిపై ఒకరు చేయికూడా చేసుకుంటారు. అనంతరం విడిపోయి ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోతారు. ఆ తర్వాత వాళ్లు కలుసుకుంటారా? ఒకవేళ కలుసుకుంటే గొడవలు మర్చిపోయి కలిసిపోతారా? లేదా? అన్నదే మిగితా కథ.

విశ్లేషణ : 2013లో విడుదలైన గూగ్లీ ఫుల్‌ లెన్త్‌ రొమాంటిక్‌ కామెడీ మూవీ. చిన్న చిన్న అనుమానాలే పెనుభూతాలై ప్రేమను ఎలా కూల్చుతాయో చెప్పటానికి శరత్‌, స్వాతీ పాత్రలే నిదర్శనం. అనుమానాలకు, అహాలకు పోయి ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకుని బాధపడే వ్యక్తి పాత్రలో యశ్‌ నటన అద్భుతంగా ఉంటుంది. ప్రేమికులుగా తమ పాత్రలకు యశ్‌, కృతి కర్బందాలు వందశాతం న్యాయం చేశారని చెప్పొచ్చు. పాత కథే అయినా ఇద్దరి మధ్యా ప్రేమలో కొత్తదనం ఉంటుంది.


లేదా worldoflove@sakshi.comకు మెయిల్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement