ఈ రెండూ ఉంటే చాలు.. గులాబ్‌ జామూన్‌ రెడీ | Easy 2 Ingredient Gulab Jamun Recipe Goes Viral On Tik Tok | Sakshi
Sakshi News home page

బ్రెడ్‌, పాలతో గులాబ్‌ జామూన్‌ రెడీ!

May 7 2020 11:40 AM | Updated on May 7 2020 1:14 PM

Easy 2 Ingredient Gulab Jamun Recipe Goes Viral On Tik Tok - Sakshi

లాక్‌డౌన్‌లో సెలబ్రిటీలు సహా సామాన్యులు తమ పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తూ సోషల్‌ మీడియాలో అనేక వీడియోలు షేర్‌ చేస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే పదార్ధాలతో వైరైటీ వంటకాలు చేస్తూ నోరూరిస్తున్నారు. తాజాగా కేవలం రెండే రెండు ఇంగ్రీడియెంట్స్‌తో గులాబ్‌ జామూన్‌ తయారు చేశారు ఓ టిక్‌టాక్‌ యూజర్‌. ఖోయా, కండెన్సెడ్‌ మిల్క్‌, మిల్క్‌ పౌడర్‌ లేకుండానే మృదువైన గులాబ్‌ జామూన్లు లాగించేయ వచ్చని నిరూపించారు. ప్రస్తుతం టిక్‌టాక్‌లో వైరలవుతున్న ఈ వీడియో ఇప్పటికే 4 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది. ఏంటీ.. మీకు కూడా ఆ రెసిపీ గురించి తెలుసుకోవాలని ఉంటే వీడియోపై క్లిక్‌ చేయండి. (నోరూరిస్తున్న ర‌కుల్ కుకీస్ రెసిపీ..)

‘గులాబ్‌ జామూన్’‌ తయారీ
ముందుగా నాలుగు లేదా ఐదు బ్రెడ్‌ స్లైస్‌లను తీసుకుని వాటిని ముక్కలు ముక్కలుగా చేయండి. ఆ తర్వాత కాచి చల్లార్చిన పాలు వేసి.. మృదువైన బ్యాటర్‌ వచ్చేంత వరకు కలపండి. బాదం పప్పు తురుమును మధ్యలో వేసి ఆ మిశ్రమాన్ని గుండ్రటి ఉండల్లా చుట్టండి. వాటిని నూనెలో వేయించి పక్కకు పెట్టి.. ఆ తర్వాత చక్కెర పాకంలో వేయండి. అంతే టేస్టీ టేస్టీ గులాబ్‌ జామూన్లను లొట్టలేసుకుంటూ తినేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement