
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు మండలంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కోటెకల్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కోటెకల్ వద్ద ఈ రోజు ఉదయం టాటా ఏస్‌ను లారీ ఢీకొట్టింది.
దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.