ఓటు రక్షణకు సీ విజిల్‌ యాప్‌

Citizens Vigil App For Vote Protection - Sakshi

సాక్షి, రామగిరి: ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన సీ విజిల్‌ యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జి తహసీల్దార్‌ రామ్మోహన్‌ అన్నారు. సెంటినరీకాలనీలోని ప్రగతి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు శుక్రవారం సీ విజిల్‌ యాప్‌పై అవగాహన కల్పించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఎన్నికలు సజావుగా నిర్వహించడం కోసం ప్రతి ఒక్కరూ సీ విజిల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో గ్రామాల్లో ఓటర్లను వివిధ పార్టీల నాయకులు ప్రలోభాలకు గురి చేయకుండా అడ్డుకోవచ్చునని వివరించారు.

ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సీ విజిల్‌ యాప్‌ ఎంతగానో దోహదపడుతోందని సూచించారు. సీ విజిల్‌ యాప్‌ ద్వారా గ్రామాల్లో ఎన్నికల నియామావళిని ఉల్లంఘినట్లయితే అందుకు సంబంధించిన ఫొటో లేదా వీడియోను అప్‌లోడ్‌ చేయడంతో  సంబంధిత ఎన్నికల అధికారులకు చేరడంతో నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుని తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈయాప్‌ గురించి విద్యార్థులు ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ అబ్బు కేశవరెడ్డి, ఆర్‌ఐ అజయ్‌  పాల్గొన్నారు.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top