పరిమితంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు | BSNL broadband services in medaram | Sakshi
Sakshi News home page

పరిమితంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు

Feb 1 2018 4:34 PM | Updated on Oct 9 2018 5:58 PM

BSNL broadband services in medaram - Sakshi

జాతరలో భక్తులకు ఉచితంగా ఇంటర్నెట్‌ డాటా సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు పరిమితంగా అందుబాటులోకి వచ్చాయి.

మేడారం: జాతరలో భక్తులకు ఉచితంగా ఇంటర్నెట్‌ డాటా సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలు చేసిన బీఎస్‌ఎన్‌ఎల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు పరిమితంగా అందుబాటులోకి వచ్చాయి. జాతర జరిగే ప్రాంతాల్లో 20 హాట్‌స్పాట్‌ పరికరాలు ఏర్పాటు చేసి ఒకరికి 500 ఎంబీ డాటా ఉచితంగా లక్షలాది మందికి అందిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు ప్రకటించారు. కానీ ఐటీడీఏ, అమ్మవారి గద్దెలు, జంపన్నవాగు సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో తప్పా, రెడ్డిగూడెం, శివరాంసాగర్, కొత్తూరు, బస్టాండ్, నార్లాపూర్, కాల్వపల్లి తదితర ప్రాంతాల్లో సిగ్నల్స్‌ లేక ఇబ్బందులు పడ్డారు. రూ.20లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఉచిత డాటా సౌకర్యం అధికారులకు మాత్రమే ఉపయోగపడ్డాయి తప్పా భక్తులు వినియోగించుకోలేకపోయారు. ఇతర ప్రైవేట్‌ సంస్థలకు సైతం డాటా ప్రొవైడ్‌ చేయడం వల్లే ఈ పరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది. డాటా లేకున్నా కాల్స్‌ కూడా చేసుకోలేని పరిస్థితులు ఉండటంతో వినియోగదారులు ఆవేదన చెందారు.

కాల్స్‌ కూడా అంతంతే...
మేడారం జాతరలో పెద్ద సంఖ్యలో టవర్లు ఏర్పాటు చేసి భక్తులకు సిగ్నల్‌ అందిస్తామని ఊదర కొట్టిన సెల్‌ కంపెనీలు వాస్తవంలో ఎలాంటి సదుపాయాలు అందించడంలో ఘోరంగా విఫలమయ్యా యి. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సుమారు 16 ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు రోజూ ఒకేసారి 3.5లక్షల మంది మాట్లాడుకునే సౌకర్యం కల్పిస్తామని ప్రకటనలు చేయగా, అందుబాటులోకి తేలేకపోయింది. దీంతో భక్తులు సెల్‌ సిగ్నల్స్‌ లేక ఇబ్బందులు పడ్డారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement