యూట్యూబ్‌ డబ్బుతో 25 కోట్ల భవంతి

youtube Dancer JoJo Siwa New Mansion - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తన పాటలతో, నృత్యాలతో ప్రేక్షకులను అదరకొడుతున్న ప్రముఖ యూట్యూబర్‌ జోజో సివా. కుప్పలు తెప్పలుగా వచ్చి పడిన డబ్బులతో కొత్త భవంతిని కొనుగోలు చేశారు. ఇంతవరకు అమెరికా, కాలిఫోర్నియాలోని ఓక్స్‌లో తల్లిదండ్రులతో ఉన్న ఇంటిని ఖాళీ చేసి ఇప్పుడు లాస్‌ ఏంజెలిస్‌ రాష్ట్రంలోని టార్జానా నగరంలో కొత్తగా నిర్మించిన భవంతిని 25 కోట్లకు కొనుగోలు చేశారు. తన ఇంటిని పరిచయం  చేస్తూ ఆమె తీసిన వీడియోను ఆమె గురువారం సోషల్‌ మీడియాకు విడుదల చేయడంతో అది వైరల్‌ అవుతోంది. 

అమెరికాకు చెందిన 16 ఏళ్ల జోజో అనతికాలంలోనే ప్రముఖ యూట్యూబర్‌గా ఎదిగారు. ఆమెకు ఇప్పుడు అందులో కోటిన్నర మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. తద్వారా ఆమెకు యాడ్స్‌ రూపంలో ఊహించని డబ్బు పచ్చి పడుతోంది. అలా కూడ బెట్టిన డబ్బులో పాతిక కోట్లను వెచ్చించి ఆమె ఈ భవంతిని కొన్నారు. ఆరువేల చదరపు గజాల విస్తీర్ణం గల ప్రాంగణంలో నిర్మించిన ఈ భవంతిలో హాలు, కిచెన్, బెడ్‌ రూములతోపాటు డైనింగ్‌ రూమ్, ఫన్‌ రూమ్, స్నూకర్స్‌ రూమ్‌ ఉన్నాయి. ఇంటి వెనకాల పలు సిట్‌ అవుట్లతోపాటు ఆకర్షణీయమైన స్విమ్మింగ్‌ ఫూల్‌ ఉంది. బాస్కెట్‌ బాల్‌ కోర్టు అదనపు ఆకర్షణ. కిచెన్‌లో పాప్‌కార్న్‌ మేకర్, పిజ్జా వారియర్‌లతోపాటు పలు వంట మిషిన్లు ఉన్నాయి. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top