డల్లాస్‌లో వైఎస్సార్‌సీపీ నిరసన దీక్ష | Sakshi
Sakshi News home page

డల్లాస్‌లో వైఎస్సార్‌సీపీ నిరసన దీక్ష

Published Sun, Apr 15 2018 11:25 PM

 US Department Of State YSRCP One Day Protest  - Sakshi

డల్లాస్‌: ప్రత్యేకహోదాకి మద్దతుగా డల్లాస్‌లో  వైఎస్సార్‌సీపీ అమెరికా విభాగం ఆధ్వర్యంలో ఒకరోజు నిరసన దీక్షను నిర్వహించారు. ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు అరవింగ్లో ఉన్న గాంధీ ప్లాజా వద్ద దీక్ష చేపట్టారు. దీక్షలో అనేకమంది తెలుగువాళ్లు పాల్గొని మద్దతు తెలిపారు. దీక్ష విరమించిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టారు. వాతారణం అనుకూలించకపోయినప్పటికీ తీవ్రమైన చలిగాలుల్ని  లెక్కచేయకుండా నిరసన దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్రాన్ని విడదీసి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే ఇప్పుడు హోదాని అడ్డుకొని టీడీపీ, బీజేపీపార్టీలు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 చంద్రబాబునాయుడు అనేక కేసుల్లొ ఇరుక్కోవటం మూలానే కేంద్రంతో రాజీపడి హోదాని తాకట్టు పెట్టాడని ధ్వజమెత్తారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడు జగన్‌ మోహన్‌రెడ్డి  చేస్తున్న అలుపెరగని పోరాటం కారణంగానే ప్రత్యేకహోదా ఉద్యమం సజీవంగా ఉందని, ప్రత్యేకహోదా సాధించే సత్తా ఒక్క జగన్‌ మోహన్‌రెడ్డికే ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్  ప్రజలు జగన్‌ మోహన్‌రెడ్డి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గడిచిన పార్లమెంట్ సమావేశాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు 13 సార్లు అవిశ్వాస తీర్మానం పెట్టారని గుర్తుచేశారు. కేంద్రం వైఖరికి నిరసనగా తమ ఎంపీ పదవులకి రాజీనామాలు చేసారని, ఆ తరువాత 6 రోజులపాటు అమరణనిరాహార దీక్ష చేసిన ఎంపీలని అభినందించారు. ఎంపీల స్ఫూర్తితోనే ఒకరోజు నిరాహారదీక్ష చేస్తున్నట్లు నిర్వాకులు పేర్కొన్నారు. 

గతంలో కేజీబేసిని అంబానీకి కట్టబెట్టి చంద్రబాబు ఆంధ్ర ప్రజలకు తీరని అన్యాయం చేసారని, ఇప్పుడు పోలవరం ముడుపుల కోసం ప్రత్యేకహోదాని తాకట్టు పెట్టాడని విమర్మించారు. రాబోయే ఎన్నికలలో చంద్రబాబుకి బుద్ధి చెప్పి ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్న జగన్‌ మోహన్‌రెడ్డికి అండగా నిలవాలని ఏపీ ప్రజలకి  ఎన్‌ఆర్‌ఐలు విజ్ఞప్తి చేశారు.

నిరసన దీక్షలోపాల్గొన్న వారిలో... మణి అన్నపురెడ్డి, కృష్ణారెడ్డి కోడూరు, రామి రెడ్డి బూచిపూడి, రమణారెడ్డి పుట్లూరు, శివ రెడ్డి వెన్నం, శ్రీకాంత్ రెడ్డి జొన్నల, చందురెడ్డి చింతల ,ప్రసాదరెడ్డి చొప్పా, రవి అరిమండ, ఉమా మహేశ్వర్ రెడ్డి కుర్రి, భాస్కర్ రెడ్డి గండికోట, ఉమా మహేశ్వర్ పార్నపల్లి, అవినాష్ రెడ్డి వెల్లంపాటి, శ్రీనివాస్ రెడ్డి ఓబుల్రెడ్డి, చైతన్య రెడ్డి, సునీల్ దేవిరెడ్డి, జయసింహ రెడ్డి, మధు మల్లు, తిరుమల రెడ్డి కుంభుమ్, తేజ నందిపాటి, పాల్, కిరణ్ సాలగాల ,తిరుపతిరెడ్డి పేరం, మల్లికార్జున మురారి, హేమంత్, యశ్వన్త్, చైతన్య,జగదీష్, రవి కదిరి, శరత్ యర్రం, ఉదయ్, శ్రావణ్,  మహేష్ కురువ తదితరులు పాల్గొని ప్రసంగించారు.


 

Advertisement
Advertisement