ట్విటర్‌లో ఎడిట్‌ ఆప్షన్‌.. ఓ ట్విస్ట్‌! | Twitter Says It Will Introduce The Edit Button but There Is a Condition | Sakshi
Sakshi News home page

ట్విటర్‌లో ఎడిట్‌ ఆప్షన్‌.. కానీ ఓ ట్విస్ట్‌!

Jul 4 2020 8:18 AM | Updated on Jul 4 2020 8:48 AM

Twitter Says It Will Introduce The Edit Button but There Is a Condition - Sakshi

ట్విటర్‌ తమ యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది.

న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో సోషల్‌ మీడియా వినియోగం విపరీతంగా పెరిగింది. ఏ విషయాన్ని అయినా వెంటనే సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం అలవాటు అయిపోయింది. వీటిలో ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ముందు వరుసలో ఉన్నాయి. అయితే మనం పెట్టే పోస్టులో ఏదైనా తప్పు ఉంటే ఫేస్‌బుక్‌లో వెంటనే సరిచేసుకోవచ్చు. కానీ ట్విటర్‌లో ఆ వెసులుబాటు ఇప్పటి వరకు లేదు. ఒకవేళ తప్పుగా ట్వీట్‌ చేస్తే దాన్ని ట్వీట్‌ మొత్తాన్ని డిలీట్‌ చేసి మళ్లీ కొత్త ట్వీట్‌ చేయాల్సిందే. ట్విటర్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్న విషయం తెలిసిందే.

తాజాగా దీనిపై స్పందించిన ట్విటర్‌ తమ యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తమ అధికారిక ఖాతా ద్వారా ట్వీట్‌ చేస్తూ.. ఇకపై ట్విటర్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ బటన్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందులో ఓ ట్విస్ట్‌ పెట్టింది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించినప్పుడు ఎడిట్‌ బటన్‌ను తెస్తామని చెప్పింది. అంటే కరోనా విజృంభణ నేపథ్యంలో ట్విటర్‌ ఈ విధంగా కండిషన్‌ పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై నెటిజన్లు భారీగా స్పందిస్తున్నారు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారడంతో 2 మిలియన్లకు పైగా లైకులు రాగా, 626 రీట్వీట్‌లు వచ్చాయి. అసలు అందరూ మాస్కులు ధరించడం సాధ్యమవుతుందా అని కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది గ్లోబ్‌‌కు మాస్కు పెట్టి ఫన్నీగా ట్వీట్‌ చేస్తున్నారు. (దక్షిణాదిన మహేశ్‌ ఒకే ఒక్కడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement