ట్రంప్ ఎందుకు ఫేమస్ అయ్యాడో? ఏంటో..? | Trump popularity inexplicable and Brexit spells disaster, says Stephen Hawking | Sakshi
Sakshi News home page

ట్రంప్ ఎందుకు ఫేమస్ అయ్యాడో? ఏంటో..?

May 31 2016 6:10 PM | Updated on Apr 4 2019 4:25 PM

ట్రంప్ ఎందుకు ఫేమస్ అయ్యాడో? ఏంటో..? - Sakshi

ట్రంప్ ఎందుకు ఫేమస్ అయ్యాడో? ఏంటో..?

రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష రేసులో ముందున్న డోనాల్డ్ ట్రంప్ పై ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ స్పందించారు.

లండన్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష రేసులో ముందున్న డోనాల్డ్ ట్రంప్ పై ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ స్టీఫెన్ హాకింగ్ స్పందించారు. అతి తక్కువ కాలంలో ట్రంప్ ప్రజాధరణ ఎలా పొందారో తాను అర్థం చేసుకోలేక పోతున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్ మాత్రం ప్రజాధరణ ఉన్న నేత అంటూ స్టీఫెన్ హాకింగ్ వ్యాఖ్యానించారు. ముస్లింలను తమ దేశంలోకి అడుగుపెట్టనివ్వనంటూ మొదట్లో వ్యాఖ్యానించిన ట్రంప్.. విమర్శలు రావడంతో కాస్త వెనక్కి తగ్గుతూ.. ఇది కేవలం తన సూచన మాత్రమే అని పేర్కొన్న విషయం తెలిసిందే.

భద్రత, వర్తకం విషయంలో దేశాల్నీ యూనియన్ గా ఉంటాయని, యూరోపియన్ దేశాలకు చెందిన విద్యార్థులు చాలా మంది తమ దేశంలో చదువు నిమిత్తం వస్తుంటారని ఆయన తెలిపారు. వచ్చే నెలలో రిఫరెండమ్ పెట్టినట్లయితే యూరోపియన్ లో ఉంటామని బ్రిటన్ ఓటేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. వలస అనేది చాలా దేశాలను పీడిస్తున్న సమస్య అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే మాట్లాడుతూ.. వలసపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డోనాల్డ్ ట్రంప్ ఎలా అందరి మెప్పు పొందుతున్నాడో.. అంత ఫేమస్ ఎలా అయ్యారో మాత్రం అంచనా వేయలేకపోతున్నానని హాకింగ్ చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement