ఉప్పుతో ముప్పే

Too much salt weakens the immune system - Sakshi

బెర్లిన్‌: ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే రక్తపోటు మొదలుకొని అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని మనం ఇప్పటికే చాలాసార్లు విని ఉంటాం. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ఈ తరుణంలో ఉప్పుతో రోగ నిరోధక వ్యవస్థకూ చేటే అన్న కొత్త విషయం బయటపడింది. జర్మనీలోని బాన్‌ హాస్పిటల్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు ఎలుకలపై జరిపిన పరిశోధనలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారం అందించిన ఎలుకల్లో బ్యాక్టీరియా సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు, మనుషుల్లోనూ రోజుకు మామూలు కంటే 6 గ్రాములు ఎక్కువ ఉప్పు తీసుకున్న వారిలో రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడినట్లు గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంకోలా చెప్పాలంటే ఫాస్ట్‌ఫుడ్‌తో రెండుసార్లు భోజనం చేస్తే రోగ నిరోధక వ్యవస్థ బలహీన పడుతుందన్నమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం మనిషికి రోజుకు 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది. ఇది ఒక టీస్పూ  న్‌ ఉప్పుతో సమానం. ఉప్పు ఎక్కువగా తిన్న వారి రక్తాన్ని వారం తర్వాత పరిశీలించగా, రోగ నిరోధక వ్యవస్థలో భాగమైన గ్రాన్యులోసైట్స్‌ బ్యాక్టీరియాపై పోరాడటంలో బాగా వెనుకబడినట్లు తెలిసిందని శాస్త్రవేత్తలు తెలిపారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top