ప్రేమికుడి కోసం యువతి కిడ్నీ దానం! | The perfect match: Girlfriend to give boyfriend a kidney | Sakshi
Sakshi News home page

ప్రేమికుడి కోసం యువతి కిడ్నీ దానం!

Jan 5 2016 2:10 PM | Updated on Sep 3 2017 3:08 PM

ప్రేమికుడి కోసం యువతి కిడ్నీ దానం!

ప్రేమికుడి కోసం యువతి కిడ్నీ దానం!

నిజమైన ప్రేమకు నిదర్శనం ఇదే కావొచ్చు. గత ఏడాది వేసవిలో గోల్ఫ్ కోర్సులో తొలిసారి కలుసుకున్నప్పుడు...

మాన్చెస్టర్: నిజమైన ప్రేమకు నిదర్శనం ఇదే కావొచ్చు. గత ఏడాది వేసవిలో గోల్ఫ్ కోర్సులో తొలిసారి కలుసుకున్నప్పుడు జాక్ సిమర్డ్ (49), మిషెల్లి లాబ్రాంషె తమ మధ్య ఇన్ని సారూప్యతలు ఉన్నాయని గుర్తించి ఉండరు. కానీ క్రమంగా ఒకరంటే ఒకరికీ అభిమానం ఏర్పడింది. ఇద్దరు ప్రేమలో పడిపోయారు. న్యూ హ్యాంప్షైర్ లోని స్టోన్ బ్రిడ్జ్ కంట్రీ క్లబ్లో ఇద్దరు కలిసి తరచూ గోల్ఫ్ ఆడేవారు. అయితే, మాంచెస్టర్కు చెందిన సిమర్డ్ రెండు మూత్రపిండాలు చెడిపోవడంతో గత కొంతకాలంగా ఆయన కిడ్నీ దాత కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ విషయం తెలియడంతో మిషెల్లి రహస్యంగా వెళ్లి తన కిడ్నీ ఆయనకు సరిపోతుందో లేదో పరీక్షలు చేయించుకుంది. ఆశ్చర్యకరంగా ఇద్దరి కిడ్నీలు మ్యాచ్ అయ్యాయి. వీరి ప్రేమకు చిహ్నంగా వాలంటైన్స్ డే (ఫిబ్రవరి 14) నాడు మిషెల్లి సిమర్డ్కు కిడ్నీ దానం చేయనుంది.  సిమర్డ్ 19 ఏళ్ల కిందట తొలిసారి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు. అప్పట్లో అతని సోదరి కిడ్నీ దానం చేసింది. ఇప్పుడు తన ప్రియురాలు ఇందుకోసం ముందుకొచ్చింది. తన భవిష్యత్ జీవితమంతా సిమర్డ్యేనని, ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా ఉండేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని మిషెల్లి తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement