పొగతాగడం మానేయండి..మందు తాగడం మానేస్తారు 

Stop Smoking and you will do stop Drinking Slowly - Sakshi

వాషింగ్టన్‌: న్యూ ఇయర్‌ సందర్భంగా పొగతాగడం మానేయాలని నిశ్చయించుకున్నారా.. అయితే మీరు మద్యం తాగడం కూడా మానేస్తారని అంటున్నారు శాస్త్రవేత్తలు. అదేలా అనుకుంటున్నారా.. నికోటిన్‌ అండ్‌ టొబాకో రీసర్చ్‌ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం పొగతాగడం మానేయడానికి ప్రయత్నించే మందుబాబులు మెల్లగా ఆల్కహాల్‌నూ తీసుకోవడం తగ్గిస్తారు. అంతేకాదు రోజూ పొగతాగే అలవాటు దూరమవుతుంది. అమెరికాలోని ఒరెగాన్‌ స్టేట్‌ యూనివర్సిటీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సారా డెర్‌మోడి మందుబాబులపై చేపట్టిన పరిశోధన వివరాలు వెల్లడించారు. సిగరెట్‌ వినియోగం ముఖ్యంగా మద్యం సేవించే వారిలో ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య సంబంధాలను కనుగొనడానికి 22 మందిపై కొన్నివారాల పాటు పరిశోధన చేశారు. మద్యం మానేయడానికి చికిత్స పొందుతున్న (ఎవరైతే రోజూ పొగతాగే అలవాటు ఉందో) వారి నికోటిన్‌ మెటబోలైట్‌ నిష్పత్తి, నికోటిన్‌ మెటబాలిజం ఇండెక్స్‌ను అధ్యయనం చేశారు.

వారంలో సగటున 29 నుంచి 7 కు వీరి నికోటిన్‌ మెటబోలైట్‌ రేటు తగ్గేలా చేశారు. దీంతో మద్యపానం సేవించడం తగ్గిపోయింది. నికోటిన్‌ మెటబోలిజం రేషియో అధికంగా ఉన్న మందుబాబులు ఎక్కువ పొగతాగుతారని, ఎక్కువ సమయం పొగతాగడానికే కేటాయిస్తారని రీసెర్చ్‌లో తేలింది. నికోటిన్‌ మెటబోలిజం రేషియో తగ్గించడం ద్వారా పొగతాగే అలవాటును మాన్పించవచ్చని సారా పేర్కొన్నారు. నికోటిన్‌ మెటబోలైట్‌ రేషియోలో సూచించినట్లు నికోటిన్‌ జీవక్రియను మారుస్తుందని ధూమపానం, మద్యపానం మానేయడానికి తోడ్పడుతుందన్నారు. అధిక నికోటిన్‌ మెటబోలైట్‌ నిష్పత్తి గల వ్యక్తులు ధూమపానం విడిచిపెట్టడం కష్టం కానీ, నికోటిన్‌ ప్రత్యామ్నాయ చికిత్స ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా వారు ధూమపానం వదిలేయడంలో సహాయపడుతాయి అని సారా డెర్‌మోడి చెప్పారు.  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top