కారు నిండా బాంబులతో దాడి | Somalia soldier, 4 militants killed in training site attack | Sakshi
Sakshi News home page

కారు నిండా బాంబులతో దాడి

Jun 21 2015 5:07 PM | Updated on Nov 6 2018 7:56 PM

కారు నిండా బాంబులతో దాడి - Sakshi

కారు నిండా బాంబులతో దాడి

సోమాలియాలో బాంబు దాడులు చోటుచేసుకుని ఓ ఆర్మీ సైనికుడు చనిపోగా నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

మొగాదిషు: సోమాలియాలో బాంబు దాడులు చోటుచేసుకుని ఓ ఆర్మీ సైనికుడు చనిపోగా నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మొగాదిషులో ఇంటెలిజెన్స్ అధికారులకు శిక్షణ ఇచ్చే స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడగా వారు తిప్పికొట్టారు. ముందుగా ఇద్దరు ఉగ్రవాదులు ఓ కారు నిండుగా బాంబులు వేసుకొని నేరుగా శిక్షణ పాఠశాలలోకి దూసుకొచ్చి తమను తాము పేల్చుకున్నారు. 

ఆ వెంటనే మరో ఇద్దరు తుపాకీలతో కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా అక్కడ భద్రతా సిబ్బంది అడ్డుకుని ఎదురుకాల్పులు జరిపి హతమార్చాడు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన కారును అధికారులు ముందే ఆపకుంటే భారీ నష్టం జరిగి ఉండేదని, విలువైన ఇంటెలిజెన్స్ సిబ్బంది చనిపోయేవారని ప్రభుత్వ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.



Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement