కత్తితో దాడి..ఆపై ఆత్మహత్య | husband attack son, wife later committs suicide in tirupathi | Sakshi
Sakshi News home page

కత్తితో దాడి..ఆపై ఆత్మహత్య

Feb 8 2017 5:55 PM | Updated on Nov 6 2018 7:53 PM

తిరుపతిలోని అప్పన్న కాలనీలో బుధవారం దారుణం చోటుచేసుకుంది.

తిరుపతి(చిత్తూరు జిల్లా):
తిరుపతిలోని అప్పన్న కాలనీలో బుధవారం దారుణం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సాత్విక్‌ కుమార్‌(35), మహాలక్ష్మీ భార్యాభర్తలు. సాత్విక్‌‌ చిరుద్యోగి. మహాలక్ష్మికి రెండున్నరేళ్ల కుమారుడున్నాడు. ప్రస్తుతం మహలక్ష్మి 9 నెలల నిండు గర్భిణీ.

అయితే భార్యా, కుమారుడిపై బుధవారం సాత్విక్ కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. అనంతరం కత్తితో తన గొంతు తానే కోసుకున్నాడు. తీవ్రరక్త స్రావమై సాత్విక్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. భార్య మహాలక్ష్మిని చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించగా..కుమారుడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement