పొగతాగితే కాళ్లకూ కష్టమే

Smoking Is danger to the Leg Muscles - Sakshi

న్యూయార్క్‌: ధూమపానం ఊపిరితిత్తులపై మాత్రమే ప్రభావం చూపుతుందనేది అందరి నమ్మకం. కానీ, అది తప్పని తేలింది. పొగతాగే అలవాటు కాలి కండరాలపైనా దుష్ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో రుజువయింది. ధూమపానం అలవాటు కాలి కండరాల్లో రక్తనాళాల సంఖ్యను తగ్గిస్తుందనీ తద్వారా కండరాలకు ఆక్సిజన్‌తోపాటు పోషకాల లభ్యత తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. ‘పొగాకుతో కూడిన సిగరెట్లు తాగే వారిలో పెద్ద కండరాలతోపాటు శరీరం అంతటా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ హానిని నివారించేందుకు అవసరమైన విధానాలను రూపొందించాల్సి ఉంది’అని కాలిఫోర్నియా–శాన్‌డియాగో యూనివర్సిటీకి చెందిన ఎలెన్‌బ్రీన్‌ అంటున్నారు.

ఈ పరిశోధనకు గాను కాలిఫోర్నియా, బ్రెజిల్, జపాన్‌లకు చెందిన నిపుణులు..ఒక ఎలుకను ఎనిమిది వారాలపాటు పొగాకు పొగ ప్రభావం పడేలా చేశారు. ఫలితాలను పరిశీలించగా.. ఆ ఎలుకలోని రక్తనాళాల సంఖ్య తగ్గాయి. ఫలితంగా శరీరంలోని జీవక్రియలు, చురుకుదనం మందగించాయి. వీటివల్ల డయాబెటిస్, ఊపిరితిత్తుల సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని తేల్చారు. అయితే, సిగరెట్లలో ఉండే దాదాపు నాలుగు వేల రకాలైన రసాయనాలు కండరాల క్షీణతపై ఏ మేరకు ప్రభావం చూపుతున్నాయనే అంశం మాత్రం ఈ అధ్యయనంలో వెల్లడికాలేదు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top