పాక్‌లో చీఫ్ జస్టిస్ కుమారుడు కిడ్నాప్ | Sindh CJ's son abducted in Pakistan | Sakshi
Sakshi News home page

పాక్‌లో చీఫ్ జస్టిస్ కుమారుడు కిడ్నాప్

Jun 21 2016 12:59 PM | Updated on Sep 4 2017 3:02 AM

పాకిస్థాన్లో ఓ చీఫ్ జస్టిస్ కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కోర్టు పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరిన అతడిని ఆయుధాలతో వచ్చి ఎత్తుకెళ్లారు.

కరాచీ: పాకిస్థాన్లో ఓ చీఫ్ జస్టిస్ కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కోర్టు పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరిన అతడిని ఆయుధాలతో వచ్చి ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురుని పోలీసులు అరెస్టు చేశారు. సింద్ ప్రావిన్స్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కుమారుడు ఓవయిస్ సజ్జాద్ షా న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆయన సోమవారం మధ్యాహ్నం కోర్టు పనులు ముగించుకొని పోష్ క్లిఫ్టాన్ ప్రాంతంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్లి బయటకు వస్తుండగా ఆయుధాలతో వచ్చిన నలుగురు దుండగులు ఎత్తుకెళ్లారు.

ఓ పచ్చ ఆకుపచ్చ నెంబర్ ప్లేట్ గల తెల్లకారులో వారు ఆయనను ఎత్తుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పాకిస్థాన్లో ఆకుపచ్చ నెంబర్ ప్లేట్లు ప్రభుత్వ వాహనాలకు మాత్రమే కేటాయిస్తారు. క్లిఫ్టాన్లోని తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన ఒవయిస్ ఆ తర్వాత కనిపించకుండా పోయాడని, ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నామని ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement