తిట్టేందుకు వచ్చిన ఆమె తిక్కకుదిర్చాడు | Sikh lawmaker Jagmeet Singh faced a racist rant | Sakshi
Sakshi News home page

తిట్టేందుకు వచ్చిన ఆమె తిక్కకుదిర్చాడు

Sep 9 2017 3:44 PM | Updated on Oct 17 2018 3:43 PM

తిట్టేందుకు వచ్చిన ఆమె తిక్కకుదిర్చాడు - Sakshi

తిట్టేందుకు వచ్చిన ఆమె తిక్కకుదిర్చాడు

అమెరికాలోని బ్రాంప్టన్‌లో ఓ సిక్కు పౌరుడు, చట్టసభ ప్రతినిధికి జాత్యహంకార వ్యాఖ్యల దాడి తప్పలేదు. ఆయన ఆ మాటలకు తగిన బదులు ఇచ్చి పలువురి మనసులు దోచుకున్నాడు.

ఒంటారియో: అమెరికాలోని బ్రాంప్టన్‌లో ఓ సిక్కు పౌరుడు, చట్టసభ ప్రతినిధికి జాత్యహంకార వ్యాఖ్యల దాడి తప్పలేదు. ఆయన ఆ మాటలకు తగిన బదులు ఇచ్చి పలువురి మనసులు దోచుకున్నాడు. ఆగ్రహంతో తనపైకి వచ్చిన ఓ అమెరికా మహిళ జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ అతను ఏ మాత్రం సహనం కోల్పోకుండా సంయమనంగా వ్యవహరించడమే కాకుండా ఆమె కళ్లు చెదిరే సమాధానం ఇచ్చే సభికులతో షబాష్‌ అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. జగ్‌మీత్‌ సింగ్‌ అనే వ్యక్తి కెనడాలోని న్యూ డెమొక్రటిక్‌ పార్టీ(ఎన్‌డీపీ)ని స్థాపించి నడుపుతున్నాడు. ఆయన ఒక చట్టసభ ప్రతినిధి కూడా.

ఓ ప్రచార కార్యక్రమంలో భాగంగా బ్రాంప్టన్‌ అనే పట్టణానికి వచ్చిన ఆయన సభ ముందు కొలువై ఉన్న వారిని సంబోధిస్తూ మాట్లాడే సమయంలోనే ఒక మహిళ అడ్డు తగిలింది. ఆమెను జెన్నిఫర్‌ అనే మహిళగా గుర్తించారు. నేరుగా వేదికపైకి వచ్చి 'మాకు తెలుసు నువ్వు ముస్లిం సోదరభావంతో ఉన్నావు' అంటూ ఆమె మొదలుపెట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. అయితే, అక్కడ ఉన్నవారంతా ఆమెను సముదాయించే ప్రయత్నం చేయగా వారిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

అయితే, ఆమె మాటలు విన్నతర్వాత ఆమెను నేరుగా అనకుండా ' మేం ప్రేమను, ధైర్యాన్ని నమ్ముతాం.. జాత్యహంకారాన్ని ప్రదర్శించం.. ఒక మంచిపనికి మేం జాత్యహంకారాన్ని పూయబోము.. ప్రేమను ఎలా పంచుతారో చెప్పేందుకు ముందుకు రండి.. అప్పుడైతే మేం మీకు స్వాగతం పలుకుతాం. మిమ్మల్ని ప్రేమిస్తాం. మీకు మద్దతిస్తాం' అంటూ ఆయన అన్నారు. ఈ మాటలు విన్న అక్కడి వారంతా కూడా ముగ్దులైపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement