గ్యాస్‌ పైప్‌లైన్‌ లీక్‌.. ఏడుగురి మృతి

Seven Killed In Gas Explosion In Bangladesh - Sakshi

డాకా: ఓ అపార్టమెంట్‌లో సమీపంలో గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకై పేలుడు సంభవించిన ఘటనలో ఏడుగురు మరణించారు. మరో ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు. బంగ్లాదేశ్‌నిలోని చిట్టాగాంగ్‌లో ఆదివారం సాయంత్రం ఈ ఘోర సంఘటన చోటుచేసుకుంది. ఐదంతస్తుల భవనంలో సమీపంలో గ్యాస్‌పైల్‌ లీక్‌ అయి భారీ పేలుడు సంభవించడంంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది సహాయ చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గత నెల జరిగిన ఓ గ్యాస్‌ ప్రమాదంలో ఏడుగురు చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాజధాని ఢాకా ప్రాంతంలో చోటుచేసుకుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top