బికినీలో టీచర్ల రచ్చ

Russian Teacher Sacked over Instagram Swimsuit Photos - Sakshi

సోషల్‌ మీడియాలో హాట్‌గా ఫోటోలు పెట్టిందన్న ఒకే ఒక్క కారణం ఆ ఉపాధ్యాయురాలి పాలిట శాపంగా మారింది. పలువురు పేరెంట్స్‌ ఫిర్యాదు చేయటంతో ఆమె ఉద్యోగం ఊడింది. మరెక్కడా ఆమెకు పని దొరకటం లేదు. ఈ విషయం తెలిసిన తోటి ఉపాధ్యాయులు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. బికినీ ఫోటోలతో సోషల్‌ మీడియాలో విరుచుకుపడుతున్నారు!! 

మాస్కో: 26 ఏళ్ల విక్టోరియా పోప్‌రోవా ఓమ్‌స్క్‌ పట్టణంలో 7 సిటీ స్కూల్‌లో హిస్టరీ టీచర్‌గా పని చేస్తుండేది. ఆ మధ్య సెలవులపై కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె.. బికినీలో ఓ ఫోటోషూట్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేశారు. అయితే ఆమెను ఫాలో అయ్యే వారిలో ఆమె స్టూడెంట్లు కూడా ఉన్నారు. ఈ విషయం కొందరు పేరెంట్స్‌ దృష్టికి రావటంతో వారంతా స్కూల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె నుంచి వివరణ కోరిన స్కూల్‌ మేనేజ్‌మెంట్‌.. చివరకు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది.

విషయం తెలిసిన టీచర్ల అసోసియేషన్‌ మండిపడింది. టీచర్స్‌ ఆర్‌ హ్యూమన్స్‌ టూ(#TeachersAreHumansToo) పేరిట వినూత్నంగా నిరసనకు పిలుపునిచ్చింది. అందులో మొత్తం 11 వేల మంది టీచర్లు ఫ్లాష్‌మాబ్‌లో పాల్గొన్నారు. వారంతా బికినీలతో ఫోటోలు దిగి విక్టోరియా పోప్‌రోవాకు మద్దతు తెలిపారు. ఆమెకు న్యాయం జరగకపోతే ఉద్యమం మరో రూపం దాల్చుతుందని హెచ్చరించారు. ఈ ఉద్యమం సోషల్‌ మీడియాను కదిలించింది. దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి కూడా టీచర్లు ఆమెకు మద్ధతు ప్రకటిస్తూ.. తమ ఫోటోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బికినీ ఉద్యమం అక్కడ హాట్‌ టాపిక్‌గా మారింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top