
ఎలుక సెల్ఫీ తీసుకుంది!
ఓ ఎలుక సెల్ఫీ తీసుకుని అబ్బురపరిచింది
లండన్: ఓ ఎలుక సెల్ఫీ తీసుకుని అబ్బురపరిచింది. సెల్ఫీ తీసుకున్నతొలి ఎలుకగా రికార్డు సృష్టించింది. న్యూయార్క్ సిటీ రైల్వే స్టేషన్లో యాదృశ్చికంగా ఈ ఘటన జరిగింది.
డాన్ రిచర్డ్స్ అనే టూరిస్టు కథనం ప్రకారం అతను రైలు కోసం ప్లాట్ఫామ్పై ఎదురు చూస్తుండగా.. ప్లాట్ఫామ్లో గోడకు ఆనుకుని ఓ వ్యక్తి నిద్రపోతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ ఎలుక అతనిపైకి ఎగబాకింది. దీంతో మెళకువ వచ్చిన ఆ వ్యక్తి కంగారుగా లేచేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతని జేబు నుంచి సెల్ఫోన్ కింద పడింది. వెంటనే దాన్ని తీసుకుని చూడగా మొబైల్లో ఎలుక సెల్ఫీ కనిపించింది. ఎలుక పరిగెత్తేక్రమంలో కిందపడిఉన్న సెల్ఫోన్పై ఎక్కడంతో కెమెర్ క్లిక్ మనడం, సెల్ఫోన్లో ఎలుక ఫోటో నిక్షిప్తమైంది. ఈ తతంగాన్ని వీడియో తీసిన డాన్ రిచర్డ్స్ యూట్యూబ్లో పెట్టాడు.