మొసాక్‌ ఫోన్సెకా గూఢచర్యం | Panama Papers reveal spies used Mossack Fonseca Berlin | Sakshi
Sakshi News home page

మొసాక్‌ ఫోన్సెకా గూఢచర్యం

Apr 12 2016 6:38 PM | Updated on Sep 3 2017 9:47 PM

మొసాక్ ఫోన్సికా వివిధదేశాల్లోని ప్రస్తుత, మాజీ ఉన్నత స్థాయి అధికారుల సేవలను ఏజెంట్లుగా వినియోగించుకున్నట్టు ఒక జర్మన్ వార్తాపత్రిక తెలిపింది.

బెర్లిన్: మిలియన్ల కొద్దీ డాక్యుమెంట్ల  ద్వారా ప్రపంచ  వ్యాప్తంగా పెను సంచలనానికి సృష్టించిన  పనామా పేపర్ల లీక్ వ్యవహారంలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.వంద‌మందికి పైగా స‌భ్యులుగా ఉన్న ప‌రిశోధ‌నాత్మక పాత్రికేయుల అంత‌ర్జాతీయ కూట‌మి(ఐసీఐజే) ప‌నామా కేంద్రంగా పనిచేస్తున్న  పనామా పేపర్స్ మరో విషయాన్ని తేట తెల్లం చేసింది. మొసాక్ ఫోన్సికా  వివిధదేశాల్లోని ప్రస్తుత, మాజీ ఉన్నత స్థాయి అధికారుల సేవలను  ఏజెంట్లుగా   వినియోగించుకున్నట్టు  ఒక జర్మన్ వార్తాపత్రిక తెలిపింది.  

 అనేక దేశాల గూఢచారులను   మొసాకా విస్తృతంగా  ఉపయోగించినట్టు మ్యూనిచ్ ఆధారిత వార్తాపత్రిక  వెల్లడించింది. దాదాపు మూడు దేశాలకు చెందిన సీక్రెట్ ఏజెన్సీ  అధికారులను వాడుకున్నట్టు తెలిపింది. సౌది అరేబియా, కొలంబియా, రువాండా  లాంటి దేశాల అత్యున్నత అధికారులను తమ  రహస్య సేవలకు   వినియోగించుకున్నట్టు ఈ కథనంలో పేర్కొంది.   అనేక దేశాలలో,సీఐఎ  వారి  మధ్యవర్తుల సహాయంతో  పనిచేస్తున్నట్టు పేర్కొంది.  ముఖ్యంగా 1990 లో మరణించిన సౌది ఇంటిలిజెన్స చీఫ్  షేక్ కమల్ అదాం 1970 లలో ఫోన్సెకా కు బాగా సహకరించినట్టు తెలిపింది. వివిధ  సీక్రెట్ ఏజెంట్లు, వారి ఇన్  ఫార్మర్ల సేవలను  సంస్థ వినియోగించుకున్నట్టు తెలిపింది.

కాగా  ఈ పనామా పేపర్స్  వెల్లడించిన అంశాలతో  ప్రపంచ వ్యాప్తంగా  రాజకీయంగా పెను దుమారాన్ని రాజేసింది.  విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్న  ప్రపంచంలోనే ధనిక,  శక్తివంతమైన  పలు  రాజకీయ నేతల జాబితాను ప్రకటించింది. దీంతో ఐస్ లాండ్ ప్రధాని రాజీనామా చేసిన సంగతి తెలిసింది.





 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement