
పాక్ తొలి డ్రోన్ ఎటాక్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పాకిస్థాన్ తొలి డ్రోన్ ఒకటి విజయవంతంగా తన విధిని నిర్వర్తించింది.
పెషావర్: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన పాకిస్థాన్ తొలి డ్రోన్ ఒకటి విజయవంతంగా తన విధిని నిర్వర్తించింది. సోమవారం దానిని ఉగ్రవాదుల ప్రభావం ఉండే ఉత్తర వజీరిస్థాన్లో ప్రయోగించగా ముగ్గురు కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పాక్ అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు విదేశీ పరిజ్ఞానంతో డ్రోన్లను తయారుచేసి దాడులకు ఉపయోగించిన పాక్ ఇటీవల బురాక్ డ్రోన్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. దీనిని ముఖ్యంగా ఉగ్రవాదులు ఎక్కువగా ఉండే శవాల్ లోయలో ప్రయోగించి క్షిపణులు విడిచి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేయగా ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దీనిని అధికారికంగా ఆమోదించడానికి ముందు తొలిసారి ఈ ఏడాది మార్చి 14 ప్రయోగించి చూశారు.