1,600 మంది కార్మికులకు ఉద్వాసన | Over 1600 workers sacked in Bangladesh following labour unrest | Sakshi
Sakshi News home page

1,600 మంది కార్మికులకు ఉద్వాసన

Dec 28 2016 9:02 AM | Updated on Sep 4 2017 11:49 PM

1,600 మంది కార్మికులకు ఉద్వాసన

1,600 మంది కార్మికులకు ఉద్వాసన

బంగ్లాదేశ్‌లోని 85 వస్త్ర తయారీ పరిశ్రమలు తమ సంస్థల్లో పనిచేస్తున్న 1,600 మంది కార్మికులను విధుల నుంచి తొలగించాయి.

ఢాకా: బంగ్లాదేశ్‌లోని 85 వస్త్ర తయారీ పరిశ్రమలు తమ సంస్థల్లో పనిచేస్తున్న 1,600 మంది కార్మికులను విధుల నుంచి తొలగించాయి. అక్రమంగా నిరసనల్లో పాల్గొన్నందుకు, వేతనాలు పెంచాలని డిమాండ్‌ చేసి సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయేలా చేసినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

కార్మికుల కనీస వేతనాన్ని నెలకు రూ.4,560 నుంచి రూ.13,767కు పెంచాలని కోరుతూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో ఈ నెల ప్రారంభంలో పరిశ్రమలు కొన్నాళ్లు నిలిచిపోయాయి. దీంతో అక్కడ పండగలకు దుస్తుల సరఫరా నిలిచిపోతుందేమోనని భయాందోళనలు నెలకొన్నాయి.

బంగ్లాదేశ్‌ వస్త్ర పరిశ్రమల కార్మికుల సంఘం మాత్రం 3,500కు పైగా కార్మికులను తొలగించారని తెలిపింది. పోలీసుల అరెస్టులు, వేధింపులకు భయపడి ఎంతోమంది కార్మికులు దాక్కుంటున్నారని అక్కడ కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement