మా కొబ్బరి నీళ్లు తాగితే.. ఓ మురికి యాడ్‌ వైరల్‌ | Our Milk Gives You Bigger Breasts, Insists Chinese Coconut Milk Brand | Sakshi
Sakshi News home page

మా కొబ్బరి నీళ్లు తాగితే.. ఓ మురికి యాడ్‌ వైరల్‌

Feb 15 2019 11:15 AM | Updated on Feb 15 2019 5:38 PM

Our Milk Gives You Bigger Breasts, Insists Chinese Coconut Milk Brand - Sakshi

బీజింగ్‌ : సెక్సీయెస్ట్ యాడ్లకు పెట్టింది పేరైన చైనా కంపెనీ కోకోనట్‌ మిల్క్‌ బ్రాండ్‌ కంపెనీ కోకోపామ్‌  మరోసారి వార్తల కెక్కింది. 2017లో కొబ్బరి నీళ్లు తాగితే అందమైన తెల్లని శరీరం మీ సొంతమంటూ ప్రకటన రూపొందించి వివాదాల్లో ఇరుక్కున్న సంస్థ తాజాగా మరో వివాదంలో వేలుపెట్టింది. ఈసారి మా కొబ్బరి నీళ్లు తాగితే బ్రెస్ట్ సైజ్ పెరిగిపోతుందంటూ అందమైన మోడల్స్‌తో ప్రకటనను మార్కెట్లో విడుదల చేసింది. ఇది తీవ్ర చర్చకు దారితీయడంతోపాటు చైనా సోషల్‌ మీడియాలో దుమారం రేగింది. వైబో యూజర్లు ఈ యాడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొబ్బరి నీళ్ల ప్రకటన నాకు వాంతి తెప్పిస్తోంది (కోకోనట్‌ మిల్క్‌ యాడ్‌ మేక్స్‌మి వామిట్‌) అనే హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్‌ అవుతోంది.

దీంతో కొబ్బరినీళ్లను అమ్మేందుకు ఇలాంటి ప్రచార వ్యూహాన్ని అనుసరిస్తుండటంతో చైనాలోని అధికారులు రంగంలోకి దిగారు. తప్పుడు ప్రకటనలపై దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు. మరోవైపు తమ ఉద్దేశం అది కాదంటూ సదరు కంపెనీ వివరణ ఇచ్చుకుంది. కాగా 1988లో తొలిసారిగా డ్రింక్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది ఈ కంపెనీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement