'ఉత్తర కొరియా రెడీ అయింది.. మరి మీరు' | North Korea ready to open direct talks with US  | Sakshi
Sakshi News home page

'ఉత్తర కొరియా రెడీ అయింది.. మరి మీరు'

Dec 8 2017 5:17 PM | Updated on Dec 8 2017 5:17 PM

North Korea ready to open direct talks with US  - Sakshi

ప్యాంగ్‌యాంగ్‌ : తమ అణు విధానంపై అమెరికాతో ప్రత్యక్షంగా బహిరంగంగా చర్చలు జరిపేందుకు ఉత్తర కొరియా సిద్ధంగా ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్జెయ్‌ లారోవ్‌ తెలిపారు. ఈ విషయాన్ని తాను అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌కు కూడా తెలియజేసినట్లు చెప్పారు. గురువారం వియన్నాలో జరిగిన దౌత్య వేత్తల సమావేశంలో తాను ఈ సందేశాన్ని చెప్పినట్లు వివరించారు.

అయితే, టిల్లర్‌ సన్‌ నుంచి వెంటనే ఎలాంటి స్పందన రాలేదని, ముందు ఉత్తర కొరియా తన అణు కార్యక్రమాలను వదిలేసుకుంటేనే ముందుకు వెళతామనే ఆలోచనలో ఉన్నట్లు అర్థమైందని అన్నారు. ఐక్యరాజ్యసమితి ఉన్నత శ్రేణి అధికారి జెఫ్రీ ఫెల్ట్‌మేన్‌ ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి రియాంగ్‌ హోను ప్యాంగ్‌యాంగ్‌లో కలిసిన సందర్భంగా చర్చల అంశాన్ని ముందుకు తీసుకొచ్చారని, అందుకు ఉత్తర కొరియా సానుకూలంగా స్పందించిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement