అక్కడ 100 % ఓటింగ్‌..

North Korea Election Turnout 100 Percent - Sakshi

సాధారణంగా మన దగ్గర ఎన్నికలు జరిగితే ఓటింగ్‌ శాతం చాలా రాష్ట్రాలు, ప్రాంతాల్లో.. మహా అయితే 70 శాతం వరకు నమోదవుతుంటుంది. అది కూడా అతి కష్టం మీద. మరి ఓ దేశంలో మాత్రం ఎప్పుడు ఎన్నికలు జరిగినా వంద శాతం ఓటింగ్‌ నమోదు అవుతుంది. అరె అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అక్కడి ప్రజలు అంత జాగరూకతతో ఉంటారా అని అనుమానపడకండి. ఇంతకీ వంద శాతం నమోదయ్యేది ఎక్కడో తెలుసా.. ఉత్తరకొరియాలో.. ఆ దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా ఇదే రిపీట్‌ అవుతుంది. అక్కడి సుప్రీం పీపుల్స్‌ అసెంబ్లీకి అదేనండీ మన దగ్గర పార్లమెంట్‌ అంటాం కదా.. ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి.

ఇంకో విచిత్రం ఏంటంటే.. అక్కడి 687 స్థానాల్లో ఒక్కోస్థానానికి ఒకే అభ్యర్థి బరిలో ఉంటారు. ఆ నియోజకవర్గం ప్రజలు ఆ ఒక్కరికే ఓటు వేసి ఆ అభ్యర్థికే ఓటేయాలి. ఒకవేళ ఓటు వేయకపోతే వారిపై దేశద్రోహం కింద కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం ఓ చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. అందుకే భక్తితోనో.. భయంతోనో.. అందరూ ఓటేస్తారన్న మాట. ఇదండీ అసలు సంగతి.. ‘ముందే ఫిక్స్‌ అయిన మ్యాచ్‌కు అంపైరింగ్‌ ఎందుకో?’ఇదే కదా మీ డౌట్‌!
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top