కన్న బిడ్డలను కాల్చి చంపిన తల్లి!

Mother Accused In Killing Her Children In Philadelphia - Sakshi

ఫిలడెల్ఫియా(యూఎస్‌) : అమెరికాలోని ఫిలడెల్ఫియాలో దారుణం చోటు చేసుకుంది. పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే వారి పాలిట కర్కశంగా వ్యవహరించింది. తన ఇద్దరు పిల్లల్ని తుపాకితో కాల్చిచంపింది. వివరాల్లోకి వెళితే.. టాకోనీలోని హెగెర్మాన్ స్ట్రీట్ 6300 బ్లాక్‌లో సోమవారం రాత్రి తుపాకి పేలిన శబ్దం వినిపించింది. దీంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరకున్న పోలీసులు.. ఆ ఇంట్లో 38 ఏళ్ల వ్యక్తి మృతదేహాంతో పాటు, 4 ఏళ్ల బాలిక, 10 నెలల శిశువు తీవ్రంగా గాయపడి ఉన్నట్టు గుర్తించారు. గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారు మృతిచెందారు. అలాగే ఘటన స్థలంలో తనకు తానే గాయపర్చుకున్న మహిళను(28) పోలీసులు అరెస్ట్‌ చేశారు. వైద్యం కోసం ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.

అయితే ఆ ఇంట్లో ఎందుకు కాల్పులు జరిగాయనేది తెలుసుకోవడానికి పోలీసులు విచారణ చేపట్టారు. చుట్టుపక్కల వాళ్లను విచారించడంతోపాటు.. ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనలో చిన్న పిల్లలు చనిపోవడం బాధకరమని ఓ పోలీసు అధికారి పేర్కొన్నారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top