ప్రయాణికుల్ని కిడ్నాప్ చేసి కాల్చిచంపేశారు | Militants kill 20 passengers in Pakistan | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల్ని కిడ్నాప్ చేసి కాల్చిచంపేశారు

May 30 2015 8:55 AM | Updated on Sep 3 2017 2:57 AM

ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు క్వెట్టా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం

ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు క్వెట్టా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యం

సాయుధ ఉగ్రవాదులు 43 మంది ప్రయాణికుల్ని కాల్చిచంపిన కరాచీ బస్సు ఘటన మరువకముందే పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రాంతంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందిని ఉగ్రవాదులు అతిదారుణంగా హతమార్చారు.

సాయుధ ఉగ్రవాదులు 43 మంది ప్రయాణికుల్ని కాల్చిచంపిన కరాచీ బస్సు ఘటన మరువకముందే పాకిస్థాన్లోని బెలూచిస్థాన్ ప్రాంతంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మందిని ఉగ్రవాదులు అతిదారుణంగా హతమార్చారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది.  క్వెట్టా నుంచి కరాచీ బయలుదేన రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 35 మంది ప్రయాణికుల్ని.. సెక్యూరిటీ గార్డు దుస్తులు ధరించిన సాయుధ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.

విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు ప్రయాణికుల్ని బందీలుగా పట్టుకుని ఉగ్రవాదులు వెళుతోన్న బస్సును చేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఉరువర్గాలకు ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కళ్లుగప్పి బస్సును ఓ కొండ ప్రాంతంలోకి తీసుకెళ్లిన ఉగ్రవాదులు 20 మంది ప్రయాణికుల్ని అతి సమీపంనుంచి కాల్చిచంపి పారిపోయారు. మరికొద్దిసేపటికి భద్రతా బలగాలు బస్సు ఉన్న ప్రాంతాన్ని గుర్తించగలిగారు.

'ఉగ్రవాదుల దాడిలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, ఐదుగురిని కాపాడగలిగామని, మిగతావారి జాడ ఇంకా తెలియాల్సిఉందని బెలూచిస్థాన్  అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సర్ఫరాజ్ బుగ్తి మీడియాకు చెప్పారు. బెలూచిస్థాన్ వేర్పాటువాదులే ఈ దాడికి తగబడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నెల రెండో వారంలో కరాచీకి సమీపంలో షియా మైనారిటీలు ప్రయాణిస్తున్న ఉగ్రవాదులు బస్సుపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 47 మందిని హతమార్చిన సంగతి తెలిసిందే.

కాగా, తాజా ఘటనకు బాధ్యతవహిస్తూ ఉగ్రవాద సంస్థలేవీ ప్రకటన విడుదల చయలేదు. ప్రయాణికుల మరణాలపట్ల ప్రధాని నవాజ్ షరీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement