సింహం ఎన్‌క్లోజర్‌లో చేయి పెడితే..

Man Stroking Lion Gets Attacked In South Africa Horrifying Video - Sakshi

కొన్నిసార్లు మనం ప్రదర్శించే అత్యుత్సాహం.. ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి సౌత్‌ఆఫ్రికాలో చోటుచేసుకుంది. పీటర్‌ నార్జే తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యతో కలిసి సౌత్‌ ఆఫ్రికాలోని ఓ పార్క్‌కు వెళ్లారు. అక్కడ ఎన్‌క్లోజర్‌లోకి తన చేతిని చాచిన పీటర్‌.. అందులో ఉన్న ఓ సింహాన్ని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేశాడు. అది విడిపించుకునేందుకు ప్రయత్నించిన కూడా అదిమి పట్టడానికి యత్నించాడు. ఇంతలోనే ఆ పక్కనే ఉన్న ఆడ సింహం అతని వద్దకు చేరుకుంది. దానిని కూడా దగ్గరకు తీసుకుందామనుకున్న పీటర్‌కు గట్టి షాకే తగిలింది. ఆడ సింహం పీటర్‌ చేతిని ఒక్కసారిగా నోటిలో పెట్టుకుంది. ఆడ సింహం నోటిలో నుంచి చేతిని విడిపించుకోవడానికి పీటర్‌ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అతని భార్య బిగ్గరగా కేకలు వేసింది. 

కొన్ని సెకన్ల తరువాత ఆడ సింహం నోటి నుంచి పీటర్‌ తన చేతిని బయటకు తీసుకోగలిగాడు. ఆ తర్వాత చికిత్స కోసం అతను ఆస్పత్రిలో చేరాడు. కాగా, ఆ పార్కు యాజమాన్యం ఈ ఘటనకు బాధ్యత వహించేందుకు నిరాకరించింది. పార్క్‌లో ప్రతి చోట సైన్‌ బోర్డ్‌లు ఉన్నాయని.. కానీ పీటర్‌ వాటిని అతిక్రమించారని పార్క్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top