వైరల్‌ వీడియో: 20 ఏళ్ల తర్వా కలుసుకున్న సోదరులు

Man Meets His Brother at US Airport for the First Time in 20 Years - Sakshi

వాషింగ్టన్‌: రక్తం పంచుకుపుట్టిన వారి మధ్య ఉండే అనుబంధమే వేరుగా ఉంటుంది. ఎంత దూరాన ఉన్నా.. ఎన్ని రోజుల తర్వాత కలిసినా ఆ బంధం మాత్రం చెరిగిపోదు. ఇందుకు సాక్ష్యంగా నిలిచింది అమెరికాలో జరిగిన ఓ సంఘటన. రక్తం పంచుకుపుట్టిన ఇద్దరు అన్నదమ్ములు దాదాపు 20 ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. ఒకరినొకరు ఎదురెదురుగా చూసుకున్న ఆ సమయాన వారి భావాలను వ్యక్తం చేయడానికి మాటలు సరిపోవు. కేవలం చూసి అర్థం చేసుకోవాల్సిందే. ఇసాబెల్‌ గోడోయ్‌ అనే వ్యక్తి తన ట్విటర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

‘20 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ రోజు మా నాన్న తన సోదరుడిని కలుసుకోబోతున్నారు. సోదరుడికి సర్‌ప్రైజ్‌ ఇవ్వడం కోసం మా నాన్న కొన్ని గంటల ముందే విమానాశ్రయానికి వచ్చాడు’ అంటూ ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు. దాదాపు 26 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఇసాబెల్‌ తండ్రి.. తన సోదరుడి వెనకే నిల్చుని కెమరాకు హాయ్‌ చెప్పాడు. లగేజ్‌ కోసం ఎదురు చూస్తున్న అతడి సోదరుడు వెనక్కి తిరిగే సరికి ఎదురుగా ఇసాబెల్‌ తండ్రి. సోదరులిద్దరూ ఒకరినొకరు చూసుకున్న ఆ క్షణంలో వారి సంతోషాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. ఆనందం నుంచి తేరుకుని సోదరులిద్దరూ ఒకర్ని ఒకరు గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ తమ తల్లిని కలవడానికి అలస్కా వెళ్లారు. ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియోను ఇప్పటికే దాదాపు 11 లక్షల మంది వీక్షించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top