జార్జిబుష్ కుమార్తె కోసం.. ఆయన హత్యకు కుట్ర | Man arrested after allegedly threatening to kill George Bush | Sakshi
Sakshi News home page

జార్జిబుష్ కుమార్తె కోసం.. ఆయన హత్యకు కుట్ర

Feb 2 2014 4:52 PM | Updated on Apr 4 2019 3:25 PM

జార్జిబుష్ కుమార్తె కోసం.. ఆయన హత్యకు కుట్ర - Sakshi

జార్జిబుష్ కుమార్తె కోసం.. ఆయన హత్యకు కుట్ర

అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జిబుష్ కుమార్తెను దక్కించుకునేందుకోసం ఏకంగా ఆయనను అంతమొందించాలని కుట్ర పన్నిన ఓ వ్యక్తిని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు.

న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జిబుష్ కుమార్తెను దక్కించుకునేందుకోసం ఏకంగా ఆయనను అంతమొందించాలని కుట్ర పన్నిన  ఓ వ్యక్తిని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్నుంచి బుల్లెట్లునింపిన రైఫిల్, కత్తి, పెట్రోల్ స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫెడరల్ కోర్టులో దాఖలైన ఫిర్యాదు మేరకు బెంజమిన్ స్మిత్ (44).. బుష్ కూతురు బార్బరా బుష్ ప్రేమ పొందేందుకు ఆయనను అడ్డుతొలగించుకోవాలని పథకం వేశాడు. జార్జి బుష్ను కిడ్నాప్ చేసి, హత్య చేసేందుకు సిద్ధమయ్యాడు. జార్జిబుష్కు ఇద్దరు కవలలు ఉన్నారు.

స్మిత్ తన పథకం గురించి రాసిన లేఖను ఇంట్లో అతని తల్లి కనుగొంది. ఆమె వెంటనే ఈ విషయాన్నిఅమెరికా సీక్రెట్ సర్వీస్ అధికారులకు తెలియజేసింది. డ్రాగన్లా చంపాలనుందని, అప్పడు బార్బరా తన సొంతమవుతుందని అందులో రాశాడు. అధ్యక్షుడు ఒబామా సహా అమెరికా అంతమవుతుందని పేర్కొన్నాడు. ఇంట్లో రైఫిల్ కనిపించకపోవడం, స్మిత్ కూడా అచూకీ లేకుండాపోవడంతో అతని తల్లి అధికారులకు తెలియజేసింది. స్మిత్ సెల్ఫోన్ను ట్రాక్ చేసి, అతను కారులో మన్హాటన్ వెళ్తుండా అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు స్మిత్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాను భార్యతో విడాకులు తీసుకున్నానని, బార్బరాను దక్కించుకునేందుకు కో్సం బుష్ను చంపేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement