
మహాత్ముడా.. మజాకా!
జాతిపిత మహాత్మాగాంధీ చిత్రంతో ఉన్న అరుదైన స్టాంపులు యూకేలో రికార్డు ధర పలికాయి.
లండన్:
జాతిపిత మహాత్మాగాంధీ చిత్రంతో ఉన్న అరుదైన స్టాంపులు యూకేలో రికార్డు ధర పలికాయి. యూకేలోని స్టాన్లీ గిబ్బన్స్ అనే స్టాంప్ కలెక్టింగ్ కంపెనీ మహాత్ముడి చిత్రంతో ఉన్న నాలుగు స్టాంపులను వేలం వేయగా.. రికార్డు స్థాయిలో 5లక్షల పౌండ్ల ధర పలికాయి. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 4.1కోట్లు చెల్లించి వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి వీటిని దక్కించుకున్నారు.
యూకేలో ఓ భారత స్టాంప్‌కు ఇంత ధర పలకడం ఇదే తొలిసారని నిర్వాహకులు చెబుతున్నారు. 1948 నాటి పది రూపాయల విలువ గల మహాత్ముడి స్టాంపులు కేవలం 13 మాత్రమే చలామణిలో ఉన్నట్లు వేలం నిర్వాహకులు చెప్పారు.