జపాన్ కుబేరుడికి భారీ ఊరట | Sakshi
Sakshi News home page

జపాన్ కుబేరుడికి భారీ ఊరట

Published Wed, Feb 21 2018 6:42 PM

Japan businessman wins in surrogate children case in Thai court - Sakshi

బ్యాంకాక్: బేబీ ఫ్యాక్టరీ కేసులో జపాన్ కుబేరుడికి థాయ్‌లాండ్ కోర్టులో భారీ ఊరట లభించింది. చిన్నారుల అక్రమ వ్యాపారం చేస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త మిట్సుటోకి షింగెటా (28)కి తీపి కబరు వచ్చింది. 13 మంది సర్రొగేట్ చిన్నారుల ఆలనా పాలనా చూసుకునేందుకు అనుమతినిస్తూ థాయ్ కోర్టు తీర్పు వెల్లడించింది. వివరాల్లోకెళ్తే.. జపాన్ కు చెందిన మిట్సుటోకి షింగెటా కుబేరుడు. ఎన్నో వ్యాపార సంస్థల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆయనకు వివాహం కాలేదు. అయితే 2014లో బ్యాంకాక్‌లో ఆయనకు చెందిన ఓ అపార్ట్‌మెంట్లో 13 మంది ఏడాదిలోపు వయసున్న చిన్నారులను పోలీసులు గుర్తించారు. పసివాళ్లను అక్రమ రవాణా చేయడం, చిన్నారులతో ఏదో వ్యాపారం చేస్తున్నారని థాయ్‌లాండ్ పోలీసులు భావించారు. దీంతో ఆ పసివాళ్ల ఆలనాపాలనను ప్రభుత్వం చూసుకునేలా చేశారు.

వ్యాపారవేత్త మిట్సుటోకి షింగెటాపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దాదాపు నాలుగేళ్ల అనంతరం ఈ కేసు చివరి విచారణ అనంతరం స్థానిక కోర్టు.. 13 మంది చిన్నారుల ఆలనాపాలనను సరోగేట్ ఫాదర్ మిట్సుటోకి చూసుకోవచ్చునని తీర్పు వచ్చింది. పోలీసులు చిన్నారులను గుర్తించేసమయానికి ఆ పసివాళ్లు ఆరోగ్యంగా ఉన్నారని, వారి ఆలనా పాలనా చూసేందుకు ఏడుగురు మహిళలు ఉన్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితుడిగా ఉన్న మిట్సుటోకి జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజమని తమకు అప్పట్లో తెలియదని, ఆయన 9 మంది థాయ్‌లాండ్ మహిళల సాయంతో సరోగసి (అద్దె గర్భం) పద్ధతిలో పిల్లల కోసం చూడగా.. 13 మంది జన్మించారని వివరించారు.

అయితే అక్రమంగా సరోగసిని పాటిస్తూ సరోగేట్ మదర్స్ డబ్బులు తీసుకుంటున్నారని, అనంతరం పుట్టిన పిల్లల్ని విదేశాలకు అధిక మొత్తాలకు విక్రయిస్తున్నట్లు తాము భావించినట్లు కోర్టులో పోలీసులు చెప్పారు. ఈ కేసు విచారణ జరుగుతున్నంత కాలం నెలకోసారి చిన్నారుల నానమ్మ(మిట్సుటోకి తల్లి) పసివాళ్లను చూసేందుకు జపాన్ నుంచి వచ్చి వెళ్లేవారు. దాంతోపాటుగా ఆ చిన్నారులకు ఇంగ్లీష్, జపనీస్ భాషలు నేర్పేందుకు ట్యూషన్ టీచర్లను సరోగేట్ ఫాదర్ మిట్సుటోకి నియమించారు.

వ్యాపారి మిట్సుటోకికి మొత్తం 17 మంది సంతానం, కాగా వీరంతా సరోగసి పద్ధతిలో జన్మించారు. అయితే నలుగురు సంతానంలో ఇద్దరు భారత మహిళల నుంచి పుట్టిన సంతానం. అయితే బ్యాంకాక్‌లో పోలీసుల ఆకస్మిక దాడులకు ముందే నలుగురు చిన్నారుల్ని జపాన్‌లో విక్రయించిన కొత్త ఇంట్లో మిట్సుటోకి సంరక్షణలో ఉన్నారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత థాయ్ కోర్టు వ్యాపారి మిట్సుటోకి నిర్దోషి అని తేలుస్తూ బ్యాంకాక్‌ రైడ్‌లో దొరికిన 13 మంది చిన్నారులను సరోగేట్ ఫాదర్‌కు అప్పగించాలని కోర్టు ఆదేశించింది. 2015లో సరోగసిపై థాయ్‌లాండ్ చట్టాన్ని తీసుకొచ్చి కొన్ని ఆంక్షలు విధించిన విషయం విదితమే.    


 

Advertisement

తప్పక చదవండి

Advertisement