వీసా మోసంపై బ్రిటన్‌ హోంమంత్రికి లేఖ

Indian students caught up in visa row take plea to Sajid Javid - Sakshi

లండన్‌: బ్రిటన్‌లో విద్యార్థి వీసాలు పొందేందుకు రాసే టెస్ట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ కమ్యూనికేషన్‌(టీవోఈఐసీ)లో మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీయులు గురువారం హోంమంత్రి సాజిద్‌ జావిద్‌కు లేఖ రాశారు. 2014లో జరిగిన టీవోఈఐసీ పరీక్షల్లో మోసానికి పాల్పడినట్లు తమపై తప్పుడు అభియోగాలు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వేలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలను బ్రిటన్‌ హోంశాఖ అన్యాయంగా లాక్కుంది.

ఈ జాబితా నుంచి మా పేర్లను తప్పించేందుకు ఐదేళ్లుగా పోరాడుతున్నాం. బ్రిటన్‌ హోంశాఖ మా భవిష్యత్‌ను నాశనం చేసింది. మేం మోసానికి పాల్పడ్డట్లు ఇప్పటివరకూ కనీసం ఒక్క సాక్ష్యాన్ని చూపలేకపోయింది. మా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ సమస్యను పరిష్కరించాలని హోంమంత్రి సాజిద్‌ జావిద్‌ను కోరుతున్నాం’ అని తెలిపారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top