ఎయిర్‌పోర్టులో భారత్‌ పరువుకు భంగం

India Shamed At Istanbul Airport - Sakshi

ఇస్తాన్‌బుల్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా, ఉన్నావ్‌ ఘటణలు ఇప్పుడు ప్రపంచంలో కొన్ని దేశాల ముందు భారతదేశ పరువు, ప్రతిష్టలను దిగజారుస్తున్నాయి.   టర్కీ ఆర్థిక రాజధానిగా పేరొందిన ఇస్తాన్‌బుల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కొంతమంది సామాజిక కార్యకర్తలు ‘ఇండియాలో ఆవులకు ఉన్న విలువ అక్కడి మనుషులకు, ముఖ్యంగా మహిళలకు లేదు’ అంటూ టీషర్ట్‌లపై కొటేషన్లను ముద్రించి వాటిని ధరించి ప్రదర్శిస్తున్నారు. ఇంకా కొంతమంది ‘మీ ఆడవారిని ఇండియాకు పంపించాలనుకుంటున్నారా? అయితే కొంచెం ఆలోచించండి’ అంటూ టీషర్ట్‌లపై ముద్రించు కున్నారు.

దీంతో ఈ వ్యవహారం అంతర్జాతీయ మీడియా దృష్టిలో పడింది. అంతర్జాతీయంగా భారత్‌ పరువు పోవడానికి కారణమైన ఆ అత్యాచార నిందితులను వెంటనే ఉరి తీయాలని కొంతమంది నెటిజన్లు తమ ఆవేదనను వ్యక్తం చేస్తుంటే.. మరికొంతమంది చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తున్నారంటూ టీషర్ట్‌ ధరించిన వారిపై మండిపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి మహిళలపై లైంగిక దాడులను అరికట్టనంత వరకు ఇలాంటి అవమానాలను ఎదుర్కొనక తప్పదు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top