సోషల్ మీడియాలో పక్షి హల్‌చల్ | Hiku bird, told to be a rare one doing rounds in social media | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియాలో పక్షి హల్‌చల్

Dec 9 2016 8:36 AM | Updated on Oct 22 2018 6:05 PM

సోషల్ మీడియాలో పక్షి హల్‌చల్ - Sakshi

సోషల్ మీడియాలో పక్షి హల్‌చల్

చూడటానికి అది అసలు పక్షో, జంతువో సోషల్ మీడియాలో ఓ పక్షి ఫొటో హల్‌చల్ చేస్తోంది.

సుమారు గత వారం పది రోజులుగా వాట్సప్, ఫేస్‌బుక్.. ఇలా సోషల్ మీడియాలో ఓ పక్షి ఫొటో హల్‌చల్ చేస్తోంది. చూడటానికి అది అసలు పక్షో, జంతువో మరేంటో కూడా చెప్పలేని పరిస్థితి. దాని పేరు హికు. ఇది చాలా అరుదుగా కనిపించే పక్షి అని, దాన్ని చూస్తే అంతా మంచి జరుగుతుందన్న సెంటిమెంటు ఉందని చెబుతున్నారు. ఇది ఎక్కువగా నేపాల్‌లో కనిపిస్తుంది. నాలుగు కాళ్లతో.. నక్క లాంటి శరీరం, కొన్ని కుక్కలకు ఉన్నట్లుగా శరీరం నిండా దట్టంగా తెల్లటి వెంట్రుకలు, తోక, రెండు కొమ్ములు ఉన్నాయి. నడుం భాగం బాగా సన్నగా ఉంది. ఇది ఎగురుతుందా లేదా అన్న విషయం తెలియడం లేదు. 
 
పార్వతీదేవి దానికి అరటిపళ్లు తినిపించేదని, శివుడు కూడా దీన్ని ఎవరూ చంపలేరని వరం ఇచ్చాడని సోషల్ మీడియా సందేశాల్లో ఈ పక్షి ఫొటోతో పాటు ఇచ్చిన వివరణలో చెబుతున్నారు. ఎక్కువగా వర్షాకాలంలో మాత్రమే ఇది కనిపిస్తుందట. తర్వాత హిమాలయాలకు వెళ్లిపోతుందని కూడా చెబుతున్నారు. ఇలా చెబుతున్నదాంట్లో నిజానిజాల సంగతి ఎవరికీ తెలియదు గానీ, చూడటానికి మాత్రం ఈ పక్షి చాలా చిత్రంగా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement