చెఫ్పై భార్య దాడి; హైకమిషనర్ రీకాల్ | High Commissioner to New Zealand 'Posted Back' to Delhi After Wife Accused of Assault | Sakshi
Sakshi News home page

చెఫ్పై భార్య దాడి; హైకమిషనర్ రీకాల్

Jun 27 2015 1:13 PM | Updated on Sep 18 2018 8:19 PM

చెఫ్పై భార్య దాడి; హైకమిషనర్ రీకాల్ - Sakshi

చెఫ్పై భార్య దాడి; హైకమిషనర్ రీకాల్

న్యూజిలాండ్లో భారత హైకమిషనర్ రవి థాపర్ భార్య షర్మిల సిబ్బందిలో ఒకరిపై దాడి చేసినట్టు ఆరో్పణలు వచ్చాయి.

మెల్బోర్న్: న్యూజిలాండ్లో భారత హైకమిషనర్ రవి థాపర్ భార్య షర్మిల సిబ్బందిలో ఒకరిపై దాడి చేసినట్టు ఆరో్పణలు వచ్చాయి. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన భారత విదేశీ వ్యవహారాల శాఖ రవి థాపర్ను రీకాల్ చేసింది. ఢిల్లీకి వచ్చి విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. షర్మిల దాడి చేసిన ఘటనపై విచారణ చేయడానికి ఓ బృందాన్ని న్యూజిలాండ్కు పంపింది. విచారణ నివేదికను బట్టి రవి థాపర్పై చర్యలు తీసుకుంటామని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

ఓ రాత్రి రవి థాపర్ నివాసం నుంచి చెఫ్ 20 కిలో మీటర్లు నడిచి వెళ్లిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతన్ని ప్రజలు గుర్తించి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తనను బానిసగా చూశారని, షర్మిల తనను హింసించేవారిని చెఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 10న ఈ సంఘటన తమ దృష్టికి వచ్చిన భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామని, హై కమిషనర్ను వెనక్కు పిలిపించామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement